Current Affairs Telugu Daily

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం
* అణ్వాయుధాల పరిమితిపై నూతన ఒప్పందం కుదుర్చుకోవడానికి రష్యా, అమెరికాలు  జెనీవాలో సమావేశం కానున్నాయి.
*  ఈ ఒప్పందంలో భాగస్వామ్యులు కావాలంటూ అమెరికా చైనాను సైతం  కోరింది. ‘అన్ని రకాల అణ్వాయుధాలను పరిమితం చేయడానికి రష్యా,  చైనాలతో ‘తదుపరి తరం’ ఆయుధ నియంత్రణ ఒప్పందాన్ని చూడాలనుకుంటున్నాను’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు.
*  ఈ నేపథ్యంలోనే ఒసాకాలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లతో ట్రంప్‌ ఈ అంశాన్ని వ్యక్తిగతంగా చర్చించారు.
*  దీంతో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందంపై రష్యా, అమెరికాలు మాత్రమే చర్చలకు సిద్ధమయ్యాయి. 
* అమెరికా, రష్యాల సంబంధాలు మెదటినుంచి ఒకదానిపై ఒకటి యుద్ధప్రేరేపిత సంబంధాలే.
*  అయితే 1991లో యుఎస్‌ఎస్‌ఆర్‌ కుప్పకూలి అమెరికా అగ్రరాజ్యంగా ఏకధృవప్రపంచం ఏర్పడినా సైనిక రంగంలో రష్యా ఇంకా అగ్రరాజ్యమే.
*  ముఖ్యంగా 2014లో క్రిమియాను ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకోవడం, సిరియా యుద్ధంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు రష్యా మద్దతు ఇవ్వడంతో వీటి మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
* అలాగే అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందంటూ విచారణలు, బ్రిటిష్ గడ్డపై మాజీ గూఢచారిని, అతని కుమార్తెను రష్యా విషం ఇచ్చి చంపిందనే ఆరోపణలు కూడా తోడవడంతో వీటి మధ్య సంబంధాలు ఇంకా క్షీణించాయి. 
*  ఉక్రేనియన్ నావికాదళ పడవలు, సిబ్బందిని, అలాగే యుఎస్ పౌరులను రష్యా నిర్బంధించడం వంటి ఇతర సంఘటనలపై కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  
* ప్రచ్చన్న యుద్ధకాలంనాటి ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్ఎఫ్) ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకున్న విషయం తెలిసిందే.
*  స్వల్పశ్రేణి, మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేయకూడదంటూ రష్యా, అమెరికాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి.
* ఈ సమావేశంలో ఐఎన్ఎఫ్ ఒప్పందం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

views: 770



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams