Current Affairs Telugu Daily

రూ.10లక్షలకే హ్యుందయ్‌ ఈ-కారు
* ఇటీవల విద్యుత్తు ఎస్‌యూవీ కోన విడుదలతో భారత వాహన రంగంలో కొత్త శకానికి నాందిపలికిన హ్యుందయ్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.
*  భారత్‌లో రూ.10లక్షలకే విద్యుత్తు కారును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
*  దీనిని అభివృద్ధికి రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది.
*  చెన్నైలోని హ్యుందయ్‌ ఫ్యాక్టరీలో దీనిని తయారు చేయనున్నారు. ఇది చిన్నసైజు ఎస్‌యూవీ తలపించవచ్చని సమాచారం.
* ఈ కారును మధ్య ఆసియా,  లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, అరబ్‌ దేశాలకు ఎగుమతి చేయాలనే ప్రణాళికలు తయారు చేస్తోంది. 
* ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించాలని ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో హ్యుందయ్‌ ఆ దిశగా వేగంగా పనిచేస్తోంది.
*  ఎలక్ట్రిక్‌ బ్యాటరీ ప్లాంట్‌ను  భారత్‌లో ప్రారంభించాలని ఆ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
*  ఇప్పటికే సుజుకీ, టొయోటాలు సంయుక్తంగా ఇటువంటి ప్రాజెక్టును చేపట్టాయి.
*  హ్యుందయ్‌ కూడా ఒక భాగస్వామితో కలిసి ఇటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుందని  సంస్థ భారతీయ విభాగం ఎండీ కిమ్‌ తెలిపారు.  ‘‘మేము భారత్‌ కోసం పూర్తిగా కొత్త ఉత్పత్తిని కనుగొనడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. దీని బాడీ స్టైల్స్‌ విప్లవాత్మకంగా ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
* హ్యుందయ్‌ ప్రధాన కార్యాలయం  దక్షిణ కొరియా లొని  సియోల్‌ కలదు.

views: 638

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams