Current Affairs Telugu Daily

వివాహితులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానం
* శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌)-2017 గణాంకాల విశ్లేషణలో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
*  2021 జనాభా లెక్కలకు ముందస్తుగా చేపట్టిన ఈ సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలుశాఖ ఇటీవల విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం దేశ జనాభాలో 46.8% మంది వివాహితులు ఉండగా  అన్ని రాష్ట్రాల కంటే అధికంగా 54% మంది వివాహితులతో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది.
*  ఆ తర్వాతి స్థానాలను వరుసగా కేరళ (51.5%), తమిళనాడు (51.2%), పశ్చిమ బెంగాల్‌ (51.1%) ఆక్రమించాయి.
*  తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది.
* ఎస్‌ఆర్‌ఎస్‌ 2017 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురుషుల్లో 52.5% మంది, మహిళల్లో 55.6% మంది వివాహితులు కాగా  తెలంగాణకు చెందిన మగవారిలో 48.1%, ఆడవారిలో 52.1% మంది పెళ్లిళ్లు చేసుకున్నారు.
* దేశంలోనే అత్యంత తక్కువగా బిహార్‌ జనాభాలో 41.2% మంది మాత్రమే వివాహితులుండటం గమనార్హం. 
* అత్యధిక మంది వివాహితులున్న ఆంధ్రాలో జీవిత భాగస్వామిని కోల్పోయినవారు, లేదంటే వారి నుంచి ఎడబాటుకు గురైనవారు (డబ్ల్యూడీఎస్‌) కూడా ఎక్కువే  దేశ జనాభాలో ఇలాంటివారు 3.7% కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 5.1% (పురుషుల్లో 2.4%; మహిళల్లో 7.9%) మంది ఉన్నారు. 
* తెలంగాణ జనాభాలో ఇలాంటి వారు 4.7% (పురుషుల్లో 2%; మహిళల్లో 7.6%) మంది ఉన్నారు. 
* దేశవ్యాప్తంగా చూస్తే డబ్ల్యూడీఎస్‌ బాధితుల్లో ఎక్కువమంది తమిళనాడు (5.7%), కేరళ (5.6%)కు చెందినవారు ఉన్నారు.
* జాతీయ స్థాయిలో చూసినా  భాగస్వామిని కోల్పోయి లేదా ఎడబాటుకు గురైనవారిలో మహిళలే ఎక్కువ. ఇలాంటి బాధితులు మగవారిలో సగటున 1.7% మంది ఉంటే, ఆడవారిలో 5.9% మంది ఉన్నట్టు ఎస్‌ఆర్‌ఎస్‌ విశ్లేషించింది.
 * 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల పనిచేసే జనాభాలో గ్రామీణ ప్రాంతాల్లో 63.8 శాతం, పట్టణాల్లో 68.6 శాతం ఉన్నారు.
* ఇందులో 69.9 శాతంతో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, 58.3 శాతంతో బిహార్ అట్టడుగున ఉంది. 
*  పట్టణాల్లో పనిచేసేవారిలో ఏపీవాసులు 72 శాతంతో అగ్రభాగంలో ఉండగా, 62.2 శాతంతో బిహార్ చిట్టచివరన నిలిచింది.
*  1971- 81 మధ్య కాలంలో ప్రజల్లో ఆర్ధిక చైతన్యం 53.4 శాతం నుంచి 56.3 శాతానికి పెరగ్గా, 1991 నుంచి 2017కి ఇది 65.4 శాతానికి చేరుకోవడం శుభపరిణామం. 

views: 724



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams