Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్‌  హరిచందన్‌
* ఆంధ్రప్రదేశ్‌కు కొత్త  గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌  నియమితులయ్యారు.
*  ఒడిశాకు చెందిన భాజపా నేత, మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నవ్యాంధ్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  ఉత్తర్వులు జారీచేశారు.
*  ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం ఇప్పటివరకూ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కొనసాగుతూ వచ్చారు.
*  85 ఏళ్ల బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 1971లో భారతీయ జన్‌సంఘ్‌లో చేరి ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
* 1975 ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద జైలుకెళ్లారు.
*  భాజపా ఏర్పడిన తర్వాత ఆ పార్టీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు.
*  1988లో జనతాపార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.
*  1996లో తిరిగి భాజపాలో చేరారు. న్యాయ విద్యలో పట్టభద్రుడైన ఈయన భాజపా-బీజేడీ  సంకీర్ణ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లు(రెండు పర్యాయాలు) పరిశ్రమలు, రెవెన్యూ, న్యాయశాఖల మంత్రిగా సేవలందించారు.
* భువనేశ్వర్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు, చిలికా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
*  హరిచందన్‌ రచయిత కూడా. శేష ఝలక్‌, అస్తాశిఖా, రాణాప్రతాప్‌, మానసి, మారు బతాస్‌ తదితర పుస్తకాలు రచించారు

views: 777

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams