Current Affairs Telugu Daily

బీడీఎల్‌కు ఐదేళ్లలో రూ.25,000 కోట్ల  లక్ష్యం
* ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) వచ్చే ఐదేళ్లలో రూ.25,000 కోట్ల ఆర్డర్లను సంపాదించాలనే లక్ష్యాన్ని విధించుకుంది.
*  ప్రస్తుతం సంస్థ చేతిలో రూ.8,084 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. 2023-24 నాటికి మరో రూ.17,000 కోట్ల ఆర్డర్లు లభిస్తాయని ఆశిస్తోంది.
*  మున్ముందు ఎగుమతులపైనా దృష్టి సారించనున్నట్లు తెలిపింది.
*  బీడీఎల్‌ స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బీడీఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) సిద్ధార్థ్‌ మిశ్రా   జులై 16, 1970న ప్రారంభమైన బీడీఎల్‌ దేశీయ రక్షణ రంగంలో గత 50 ఏళ్లుగా ఎంతో విలువైన సేవలను అందించిందని పేర్కొన్నారు.
* అనేక సవాళ్లను ఎదుర్కొని, రూ.లక్షల నుంచి నేడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుందని, ఈ దిశలో సాంకేతికంగానూ ఎంతో అభివృద్ధి సాధించిందని వెల్లడించారు.
* డీఆర్‌డీఓ, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంతోపాటు  ఉద్యోగులు, తమతో అనుబంధం ఉన్న వారందరికీ ఈ విజయం దక్కుతుందని తెలిపారు.
* ప్రస్తుతం దేశీయ రక్షణ అవసరాలను తీర్చడమే మా ప్రధాన లక్ష్యం.
*  ఇతర దేశాలకు ఎగుమతులు అవసరాలను తీర్చడము కుడా  మా ప్రధాన లక్ష్యం. స్నేహపూర్వక దేశం నుంచి ఇప్పటికే నాలుగు ఆర్డర్లు లభించాయి.
* దీంతోపాటు మన దేశంతో ఒప్పందాలు ఉన్న ఇతర దేశాలూ మా ఉత్పత్తులపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.
* ఇప్పటికే తేలికపాటి, బరువైన టార్పెడోలు (తాల్‌, వరుణాస్త్ర), స్వయం చోదిత ట్యాంకు విధ్వంసక క్షిపణి మిలాన్‌లను ఎగుమతి చేయడానికి అనుమతులు వచ్చాయి.
*  ఆయా దేశాల అవసరాలను బట్టి, ప్రభుత్వ అనుమతులతో ఈ ఎగుమతి ఒప్పందాలను కుదుర్చుకుంటాం. ఈ ఎగుమతులన్నీ కూడా ఉత్పత్తులకు సంబంధించినవే. సాంకేతికతను అందించం మా ప్రధాన లక్ష్యం.
* తెలంగాణలోని కంచన్‌బాగ్‌, భానూరులో మిసైళ్లను తయారు చేస్తుండగా, విశాఖపట్నంలో టార్పెడోలను ఉత్పత్తి చేస్తున్నాం.
*  ఇబ్రహీంపట్నంలో క్షిపణులను దాచి పెట్టేందుకు, భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాన్ని చేధించే క్షిపణులను పరీక్షించేందుకు మౌలిక వసతులను నిర్మిస్తున్నాం. 
*  విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు వీలుగా సోలార్‌ ప్లాంటునూ ఏర్పాటు చేశాం.
*  మహారాష్ట్రలోని అమరావతిలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ పూర్తయింది. ఇక్కడ స్వల్పదూర లక్ష్యాలను చేధించే క్షిపణులను ఉత్పత్తి చేసే ప్లాంటును నిర్మించబోతున్నాం.
*  దీనికోసం రూ.300 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

* రక్షణ రంగం ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడినప్పటికీ  సాధ్యమైనంతవరకూ దిగుమతులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మిసైళ్ల తయారీకి సంబంధించిన విడిభాగాల కోసం డీఆర్‌డీఓతోపాటు ఇతర సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం.
* ముఖ్యంగా రక్షణ రంగంలోని ఎంఎస్‌ఎంఈలతోనూ కలిసి పనిచేయబోతున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన భారత్‌లో తయారీ విధానానికి మా వంతుగా కృషి చేస్తున్నాం. గతంతో పోలిస్తే ఇప్పటికే 10శాతం మేరకు దిగుమతులు తగ్గించుకున్నాం. భవిష్యత్తులో ఇది ఇంకా తగ్గుతుంది.
* పరిశోధన అభివృద్ధిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. అమోఘ-3తోపాటు మూడోతరం ఏటీజీఎంలను అభివృద్ధి చేస్తున్నాం. 
* రక్షణ రంగంలో కృషి చేస్తున్న అంకురాలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు వీలుగా టి-హబ్‌, ఐఐఐటీ హైదరాబాద్‌లలో ఉన్న పలు అంకురాలతో కలిసి పనిచేయబోతున్నాం.
*  ముఖ్యంగా కృత్రిమ మేధ విభాగంలో సాంకేతికతను అందించే సంస్థలతో పనిచేస్తున్నాం. ఈ దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలతో ఒప్పందాలనూ కుదుర్చుకున్నాం.
*  రానున్న ఐదారేళ్లపాటు ఏటా నాలుగు నుంచి ఐదు కొత్త ప్రాజెక్టులపై పనిచేయబోతున్నాం.
* 2018-19లో మొత్తం రూ.3,069 కోట్ల టర్నోవర్‌ను సాధించాం.  రానున్న రోజుల్లో రెండంకెల వృద్ధి సాధిస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.90 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.


views: 747Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams