Current Affairs Telugu Daily

వరదలను ముందుగానే అంచనావేయవచ్చు : అమెరికా పరిశోధకులు
* వరదలు ఎప్పుడు వస్తాయి అవి ఎంతకాలం కొనసాగుతాయి వంటి అంశాలను ముందుగానే అందించే వినూత్న గణాంక నమూనాను అమెరికా పరిశోధకులు రూపొందించారు.
*  వీరిలో తెలుగు వ్యక్తి నరేశ్‌ దేవినేని కూడా ఉన్నారు. వరదలు ఎంతకాలం కొనసాగుతాయన్నది నదీ ప్రవాహం, వర్షపాతం, వాతావరణ సంబంధ అవరోధాలు వంటివాటిపై ఆధారపడి ఉంటుంది.
*  వాతావరణ సంబంధ మార్పులు, వాటర్‌షెడ్‌ ప్రాంతంలో భూ ఉపరితల పరిస్థితులను అన్వయించడం ద్వారా వరద ముంపు కాలాన్ని ముందుగానే అంచనా వేయడం సాధ్యమేనని పరిశోధనలో పాలుపంచుకున్న నాసర్‌ నజీబీ చెప్పారు.
*  తీవ్రస్థాయి వర్షపాతాలు పదేపదే చోటుచేసుకోవడం వల్ల నదుల్లో తలెత్తే అధిక ప్రవాహ పరిస్థితులు వరదలకు బీజం వేస్తాయని పరిశోధకులు గుర్తించారు.
* దీనికితోడు భారీ, స్థిర అల్పపీడన పరిస్థితులు ఉంటే అది దీర్ఘకాల వరదకు దారితీస్తుందని తేల్చారు.
*  అవి భారీగా నష్టం కలిగించే స్థాయిలో ఉంటాయని పేర్కొన్నారు. దీని ఆధారంగా ఒక మోడల్‌ను వారు రూపొందించారు.
*  దీర్ఘకాల వరదల వల్ల ఆనకట్టలు, వంతెనలు, విద్యుత్‌ కర్మాగారాలు వంటి కీలక మౌలిక వసతులకు తలెత్తే ముప్పును తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

views: 658



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams