Current Affairs Telugu Daily

 తాగునీటికి రూ.18.55 లక్షల కోట్లు  ‘మెర్రిల్‌ లించ్‌’ అంచనాలు
* దేశంలో చెన్నై తదితర ప్రాంతాల్లో నీటి సంక్షోభం తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రతి ఇంటికీ గొట్టాల ద్వారా తాగునీరందించడానికి భారీగా నిధులు అవసరమని ఓ నివేదిక వెల్లడించింది.
*  ఇందుకుగాను వచ్చే 15 ఏళ్లలో 270 బిలియన్‌ డాలర్లు (రూ. 18.55 లక్షల కోట్లు) అవసరమవుతాయని పేర్కొంది.
* నదుల అనుసంధానానికే 168 బిలియన్‌ డాలర్లు (రూ. 11.54 లక్షల కోట్లు) వెచ్చించాలని మెర్రిల్‌ లించ్‌ సంస్థ అంచనావేసింది.
*  నీటి వినియోగాన్ని తగ్గించే విధానాలు అవసరమని, దీనిపై దృష్టి సారించాలని భారత పరిశోధన విభాగం అధిపతి అమిష్‌ షా  తెలిపారు.
* అందుబాటులో ఉన్న తాజానీళ్లలో దాదాపు 89 శాతం వ్యవసాయానికే వినియోగిస్తున్నట్లు తెలిపారు.
*  చాలా రాష్ట్రాల్లో ఉచిత లేదా రాయితీపై విద్యుత్తు అందిస్తుండటం వల్ల భూగర్భజలాల వృథా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.
* భారీఎత్తున నిర్మితమవుతున్న యూపీలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని కెంట్‌-బెతావా, ఏపీలోని పోలవరం ప్రాజెక్టులను ప్రస్తావించిన ఆయన వీటి పరిధిలో నదుల అనుసంధాన పథకానికి ఆయా ప్రభుత్వాలు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

views: 646



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams