Current Affairs Telugu Daily

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాఫర్‌

* ఈ ఏడాది మే నెలలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అకాడమీలో ఉన్న క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే నియమించబడ్డ భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌కు తాజాగా ఆ దేశ క్రికెట్‌ హై పర్ఫామెన్స్‌ యూనిట్‌లోనూ చోటు కల్పించారు.
*  వసీం జాఫర్‌ను బంగ్లాదేశ్‌ జాతీయ క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. 
*  ఇప్పటివరకూ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా పని చేసిన నీల్‌ మెకంజే స్థానంలో జాఫర్‌ను ఎంపిక చేసింది.
*  త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు జాఫర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
* బౌలింగ్‌ కన్సల్టెంట్‌ చంపక రమననాయకేతో కలిసి జాఫర్‌ పని చేయనున్నాడు. 
* మిర్‌పుర్‌లోని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వసీం జాఫర్‌ ఈ మేరకు అతడితో మే నుంచి ఏప్రిల్ 2020 వరకు అంటే ఏడాదిపాటు ఒప్పందం చేసుకున్నాం.
*  తొలుత అతడు అకాడమీలోని అండర్-16, అండర్-19 జట్లకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారిస్తారు.
* జాఫర్ 40 ఏళ్లు పైబడిన తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా, అదే విధంగా తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
* 1996-97లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వసీం జాఫర్ ఇప్పటివరకు మొత్తం 251 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో యావరేజి 51.42తో 19 వేల పరుగులు చేశాడు.ఇందులో 57 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
* ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జాఫర్ అత్యధిక స్కోరు 314 పరుగులు. ఇక, భారత్ తరుపున వసీం జాఫర్ 2000 నుంచి 2008 వరకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 31 టెస్టు మ్యాచ్‌లాడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి


views: 677

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams