Current Affairs Telugu Daily

ప్రాచీన  బెంట్‌ పిరమిడ్‌  సందర్శనకు అనుమతి

* కొన్ని దశాబ్దాల తర్వాత ఈజిప్టులో అత్యంత ప్రాచీనకాలానికి చెందిన పిరమిడ్‌ సందర్శనకై పర్యాటకులకు అనుమతి ఇచ్చారు.
*  దీని పేరు బెంట్‌ పిరమిడ్‌. ఇది ఈజిప్టు రాజధాని కైరోకు దక్షిణాన  28 కిలోమీటర్ల దూరంలో ఉంది.
*  క్రీస్తుపూర్వం 4600 సంవత్సరాల క్రితం దీన్ని ఈజిప్టు నాల్గవ రాజవంశానికి చెందిన కింగ్‌ స్నెఫేరు కోసం నిర్మించారు.
*  ఈ బెంట్‌ పిరమిడ్‌ను తెరవడంతో పిరమిడ్‌ నిర్మాణాలపై పరిశోధనలకు మరింత ఊతం ఇ‍వ్వనుందని పురావస్తు శాస్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
* 101 మీటర్ల ఎత్తుతో అసాధారణంగా ఉన్న ఈ పిరమిడ్‌ తర్వాత కాలంలో పిరమిడ్‌ల నిర్మాణానికి అత్యున్నత దశగా పేర్కొనే ప్రఖ్యాత గిజా పిరమిడ్‌ కట్టడానికి మార్గదర్శి అని తెలిపారు.
* ఇది తొలిదశలో నిర్మించిన పిరమిడ్‌లకు, తర్వాత తరంలోని పిరమిడ్‌లకు మధ్య వారధిలా నిలిచిందని పేర్కొన్నారు.
*  బెంట్‌ పిరమిడ్‌లో 79 మీటర్లు ఉండే ఇరుకైన సొరంగమార్గం గుండా ప్రధాన చాంబర్‌కు చేరుకోవచ్చు.
* ఈజిప్టు పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖా మంత్రి ఖలీద్‌ మాట్లాడుతూ 1965లో దీన్ని మూసివేశామని, బెంట్‌పిరమిడ్ తో పాటు అల్కాడాగ్మటిక్‌ అనే మరో పిరమిడ్‌లో కూడా సందర్శకులకు అనుమతి ఇచ్చామన్నారు.
*  బెంట్‌పిరమిడ్‌, పిరమిడ్‌ల నిర్మాణానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు.
* అలాగే సమీప ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు సుమారు 4,000 సంవత్సరాల నాటి పురాతన అవశేషాలను కనుగొన్నారు.
*  ‘రాయి, బంకమట్టి మరియు చెక్క నిర్మాణాలతో కూడిన మమ్మీపై భాగాలు దొరికాయని, అలాగే కొన్ని మమ్మీలు కనుగొన్నామని ’ పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


views: 673

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams