Current Affairs Telugu Daily

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌

*  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్, కివీస్‌ ఆటగాళ్లకు మంచి స్థానాలు దక్కాయి.
*  ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.
*  అయితే సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లను పరిశీలించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
* సెమీస్‌లో భారత్‌పై 67 పరుగులతో రాణించిన న్యూజిలాండ్ సారథి కేన్‌ విలియమ్సన్‌ 796 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచాడు.
*  కివీస్‌ను ఓడించినంత పనిచేసిన రవీంద్ర జడేజా ఏకంగా 24 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం జడేజా 108వ స్థానంలో ఉన్నాడు.
*  మరో సెమీస్‌లో 85 పరుగులతో అదరగొట్టిన ఇంగ్లాండ్‌ ఆటగాడు రాయ్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. 774 పాయింట్లతో అతను పదో స్థానంలో కొనసాగుతున్నాడు.  
* ఫైనల్లో జట్టుని విజయతీరాలకు చేర్చిన బెన్‌స్టోక్స్‌ 694 పాయింట్లతో టాప్‌20లో స్థానం దక్కించుకున్నాడు.
*  ఆల్‌రౌండర్‌ జాబితాలో బంగ్లాదేశ్‌ ఆటగాడు షకిబ్ అగ్రస్థానంలో నిలవగా స్టోక్స్‌ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్‌ వోక్స్‌ ఏడో స్థానం, కివీస్ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ పదో స్థానంలో ఉన్నారు.
*  టోర్నీలో 20 వికెట్లు పడగొట్టిన ఆర్చర్‌ (29) టాప్‌30లో చోటు సంపాదించాడు.
* ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లకు పెద్దగా మార్పులు జరగలేదు.
*  బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ 886 పాయింట్లతో తొలి స్థానంలో, 881 పాయింట్లతో రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.
*  బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా 809 పాయింట్లతో టాపర్‌గా నిలిచాడు.
*  తొలిసారి ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ 125 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.


views: 745

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams