Current Affairs Telugu Daily

టాప్‌ బ్రాండ్‌గా టాటా  తర్వాతి స్థానాల్లో LIC, Infosys, SBI

* టాటాగ్రూప్‌ 2019లో భారత్‌లోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది.
* ఈ కీర్తి కిరీటాన్ని టాటా గతకొన్నేళ్లుగా నిలుపుకొంటూ వస్తోంది.
*  యూకేకు చెందిన బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఆఫ్‌ ది నేషనన్స్‌ నిర్వహించిన లీడింగ్‌ 100 బ్రాండ్స్‌ సర్వే ఈ విషయాన్ని చెప్పింది.
* టాటాల బ్రాండ్‌ అత్యంత వేగంగా పెరిగిందని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే వివరాలను ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్‌ స్టాండర్డ్‌ ప్రచురించింది
* టాటాల బ్రాండ్‌ విలువ ఒక్క ఏడాదిలో 37శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. 2019లో దీనివిలువ 19.55 బిలియన్‌ డాలర్లుగా తేల్చింది. గత ఏడాది 9శాతం పెరిగి 14.23 బిలియన్‌ డాలర్లుగా తేల్చింది.
* టాటాల తర్వాతి స్థానంలో 23శాతం వృద్ధితో ఎల్‌ఐసీ బ్రాండ్‌ విలువ 7.32 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలిపింది.
*  ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ విలువ 7.7శాతం వృద్ధితో 6.5 బిలియన్‌ డాలర్లకు చేరింది.
*  ఆ తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ, మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రోలు ఉన్నాయి. 
* టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ చాలా వేగంగా బ్రాండ్‌ విలువను కోల్పోయింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 28శాతం విలువ కోల్పోయింది.
* మహీంద్రా గ్రూప్‌ విలువ మాత్రం భారీగా పెరిగింది. గత ఏడాది ఈ జాబితాలో 12వ స్థానంలో ఉన్న ఆ సంస్థ ఈ సారి 5వ స్థానానికి ఎగబాకడంతో బ్రాండ్‌ విలువ 5.24 బిలియన్‌ డాలర్లకు చేరింది.
* ఇక బ్యాంకింగ్‌ రంగానికి చెందిన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలు తొలి 12 స్థానాల్లో చోటు దక్కించుకొన్నాయి.
*  ఇక తొలి 100 బ్రాండ్లలో 14 స్థానాలు బ్యాంకులవే. కోటక్‌ మహీంద్రా(23), యాక్సిస్‌ (26),బీవోబీ(45),కెనరా బ్యాంక్‌(58),బీవోఐ(68)లు ఉన్నాయి.


views: 655

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams