Current Affairs Telugu Daily

పాకిస్థాన్ కు రూ.41వేల కోట్ల జరిమానా
* బంగారం, రాగి గనులను లీజుకు ఇవ్వడాన్ని నిరాకరించినందుకు పాకిస్థాన్‌కు ప్రపంచబ్యాంకు రూ.41,100 కోట్ల భారీ జరిమానా విధించింది. 
* బలూచిస్థాన్‌లోని రెకో డిక్‌ అనే చిన్న పట్టణం బంగారం, రాగి నిల్వలకు ప్రసిద్ధి.
*  ఇక్కడి బంగారు గని ప్రపంచంలోనే అయిదో స్థానం పొందింది.
* వివిధ దేశాలతో పాకిస్థాన్‌ కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా దీన్ని లీజుకు పొంది తవ్వకాలు చేపట్టడానికి చిలీకి చెందిన అంటోఫగస్టా, కెనడాకు చెందిన బారిక్‌ గోల్డ్‌ కార్పొరేషన్‌లు సంయుక్తంగా తెత్యాన్‌ కాపర్‌ కంపెనీగా ఏర్పడి 2010లో దరఖాస్తు చేశాయి.
*  ఈ సందర్భంగా అన్ని రకాల సర్వేలు చేసి నివేదికలు సమర్పించాయి.
* అయితే వివిధ కారణాలతో బలూచిస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
*  దీంతో నష్టపరిహారం ఇప్పించాలంటూ 2011లో ఆ కంపెనీ ప్రపంచ బ్యాంకు పరిధిలోని అంతర్జాతీయ పెట్టుబడి వివాదాల పరిష్కార కేంద్రాన్ని ఆశ్రయించింది.

views: 593

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams