Current Affairs Telugu Daily

ఎన్‌ఐఏ చట్టం సవరణలకు లోక్‌సభ ఆమోదం
* జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేయబోదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు.
* ఈ సంస్థకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ప్రస్తుత చట్టానికి చేసిన సవరణలను  లోక్‌సభ ఆమోదించింది.
*  ఈ సందర్భంగా జరిగిన చర్చలో షా ప్రసంగిస్తూ.. ‘పోటా’ చట్టాన్ని రద్దు చేయకపోయి ఉంటే ముంబాయి ఉగ్రవాద దాడి జరిగేదే కాదని అభిప్రాయపడ్డారు.
*  ‘‘ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. దీన్ని పూర్తిగా ఉగ్రవాద అంతానికే ఉపయోగిస్తాం.
* ఆ క్రమంలో ఉగ్రవాది ఏ మతానికి చెందినవాడన్నది చూడం. ఈ చట్టాన్ని దుర్వినియోగం వల్లే 2004 నుంచి 2008 వరకు ఉగ్రవాదం ఎంతో పెరిగింది.
*  దాంతో చివరకు యూపీయే ప్రభుత్వమే ఎన్‌ఐఏ చట్టాన్ని తీసుకువచ్చింది’’ అని అన్నారు.
* చర్చకు హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి సమాధానం ఇస్తూ ఉగ్రవాద కేసుల్లో జరుగుతున్న దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌ను క్రమబద్ధీకరించడానికే ఈ సవరణ బిల్లు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
* భారతీయులు, భారతీయ ప్రయోజనాలను దెబ్బతీసేలా దేశం వెలుపల ఎక్కడైనా ఉగ్రవాద దాడులు జరిగినా అక్కడ కూడా విచారణ చేపట్టే అధికారం ఎన్‌ఐఏకి ఉంది.
* నేరాలపై దర్యాప్తు చేసే పోలీసు అధికారులకు దేశంలోను, బయటా ఎలాంటి అధికారాలు ఉంటాయో అలాంటి అధికారాలే ఎన్‌ఐఏ అధికారులకూ ఉంటాయి.
* ఎన్‌ఐఏఎ చట్టం కింద నమోదైన ఉగ్రవాద కేసుల సత్వర విచారణకు ఒకటి లేదా అంతకుమించిన సంఖ్యలో కోర్టులను ప్రత్యేక కోర్టులుగా ప్రకటించే అధికారాన్ని కేంద్ర, రాష్ట్రాలకు ఇచ్చింది.
* ఎప్పుడైనా ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయినప్పుడు తదుపరి జడ్జిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారం రోజుల్లోగా నియమించాలి.
*  ఒక వేళ పదవీ విరమణ చేసే వయస్సు వచ్చినప్పటికీ కేసు విచారణ దృష్ట్యా దాన్ని పొడిగించే వెసులుబాటు ఉంది.
* 31 డిసెంబర్ 2008 న భారత పార్లమెంట్ జాతీయ పరిశోధన సంస్థ చట్టం 2008 చేసింది .
*   జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)  న్యూ డిల్లీ  ప్రధాన కార్యాలయం.
*  ఎన్ఐఏకు హైదరాబాద్, గువహతి, కొచ్చి, లక్నో, ముంబై, కోల్‌కతా, రాయ్‌పూర్ మరియు జమ్మూలలో శాఖలు ఉన్నాయి. 
*డైరెక్టర్ జనరల్ - YC మోడీ 

views: 619

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams