Current Affairs Telugu Daily

గుజరాత్‌ తీర ప్రాంతంలో భారీ భద్రత

* గుజరాత్‌ తీరంలోని అరేబియా సముద్రంలో భారత తీర ప్రాంత రక్షక దళం (ఐసీజీ) భారీ నిఘాను కొనసాగిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
* కొన్ని నెలల క్రితం భారత బలగాలు.. నిబంధనలు ఉల్లంఘించిన పాక్‌కు చెందిన ఓ చేపల నౌకను స్వాధీనం చేసుకున్నాయి.
* ‘‘తీర ప్రాంత ఇతర భద్రతా బలగాలన్నింటితో కలిసి ఆ ప్రాంతమంతా విస్తరించి ఐసీజీ భారీ నిఘాను కొనసాగిస్తోంది. భవిష్యత్తులోనూ ఎటువంటి సవాళ్లు ఎదురైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది’’ కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
* ‘‘నిఘా అధికారులు, నార్కొటిక్‌ నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ (డీఆర్‌ఐ)తో కలిసి ఐసీజీ సమన్వయంతో పని చేస్తోంది.
* పాక్‌ దుస్సాహస చర్యలకు పాల్పడవచ్చని ఈ సంస్థల నుంచి ఎటువంటి సమాచారం అందినా ఐసీజీ వెంటనే ప్రతిస్పందించి సమాధానం చెబుతుంది’’ కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
* ఈ ఏడాది మార్చిలో ఐసీజీ.. పాక్‌కు చెందిన ఓ చేపల నౌక భారత జలాల్లోకి ప్రవేశించడంతో దాన్ని స్వాధీనం చేసుకుని, అందులోని ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుంది.
*  ఆ నౌకలో ఉన్న 194 నార్కోటిక్‌ పొట్లాలను కూడా స్వాధీనం చేసుకుంది.
* అంతకు ముందు కూడా గుజరాత్‌ తీరంలో ఓ పాకిస్థాన్‌ నౌకను, అందులోని 9 మంది ఇరాన్‌కు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఆ  నౌకలో 100 కిలోల హెరాయిన్‌ ఉన్నట్లు తెలిసింది.


views: 623

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams