Current Affairs Telugu Daily

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కల్‌రాజ్‌ మిశ్రా

* మాజీ కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్రా  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 
*  ప్రస్తుతం  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా  ఉన్న ఆచార్య దేవవ్రత్ గుజరాత్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. 
*  ఇదిలా ఉండగా, రానున్న మూడు నెలల్లో 10 రాష్ట్రాల గవర్నర్‌ల పదవీ కాలం పూర్తి కానుంది.
* వారిలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్‌ రామ్ నాయక్ కూడా ఉన్నారు.
* ఆ రాష్ట్రాలకు కేంద్రం కొత్తవారిని నియమించే ప్రక్రియను హిమాచల్ ప్రదేశ్‌తో ప్రారంభించింది. 
* 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని డియోరియా ప్రాంతం నుంచి ఎన్నికైన కల్‌రాజ్ మిశ్రా ఎన్డీఏ-I ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
* 75 సంవత్సరాలు పైబడటంతో 2017లో ఆ పదవికి రాజీనామా చేశారు. అదే కారణంతో ఈసారి ఎన్నికల్లోను పోటీ చేయలేదు. 


views: 616

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams