Current Affairs Telugu Daily

అద్దె గర్భం (సరోగసీ) నియంత్రణ బిల్లు

* అద్దె గర్భం (సరోగసీ) విధానాన్ని వ్యాపారంగా వాడుకోకుండా చూసేందుకు పలు నిబంధనలతో కూడిన ‘అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు–2019’ని కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌  లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
*  ఈ బిల్లును కూడా గతేడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఆమోదించినప్పటికీ పార్లమెంటు దీనికి పచ్చజెండా ఊపకపోవడంతో గడువు చెల్లింది.
* దీంతో ఈ బిల్లును మళ్లీ కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
*  ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం కనీసం ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యి, ఇంకా పిల్లలు పుట్టని దంపతులకు మాత్రమే అద్దె గర్భం ద్వారా బిడ్డను కనే అవకాశం కల్పిస్తారు.
* అలా పుట్టిన బిడ్డను వారు మళ్లీ ఏ కారణం చేతనైనా వదిలేయకూడదు.
* దంపతుల్లో భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య, భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
*  ఒక మహిళ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దంపతులకు తన గర్భాన్ని అద్దెకివ్వవచ్చు.
*  ఆమె కచ్చితంగా పిల్లలు లేని దంపతులకు దగ్గరి బంధువై ఉండాలి.
* ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యి, పిల్లలు ఉండాలి. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
* ఇప్పటివరకు అద్దెగర్భం విధానానికి సంబంధించి ఇండియాలో చట్టం ఏదీ లేదు.
* దీంతో విదేశీయులు ఇక్కడకు వచ్చి, మన దేశంలోని మహిళల ద్వారా ఈ విధానంలో బిడ్డలను కంటూ ఆ మహిళకు సరైన పరిహారం ఇవ్వడం లేదు.
* అలాంటి మహిళలు ఇకపై దోపిడీకి గురవకుండా ఉండటం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.
‌* ఈ బిల్లు ప్రకారం ...జాతీయ, రాష్ట్రస్థాయుల్లో ‘సరోగసీ బోర్డు’లు ఏర్పాటవుతాయి. 
‌‌* కేవలం భారతీయ దంపతులకు మాత్రమే అద్దెగర్భం విధానం ద్వారా సంతానం పొందేందుకు అనుమతి ఉంటుంది. ఆ దంపతులు చట్టబద్ధంగా వివాహం చేసుకుని కనీసం అయిదేళ్ల కాలం పూర్తయి ఉండాలి.  
‌‌* స్వార్థరహితంగా, ఇతరులకు సాయం చేయాలనే లక్ష్యంతో గర్భం మోయడానికి ముందుకొచ్చే మహిళలను మాత్రమే ఇందుకు అనుమతిస్తారు. 
‌‌* గర్భదానానికి సిద్ధపడిన మహిళ కచ్చితంగా వివాహిత అయి ఉండాలి. వయసు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆమెకంటూ సొంత పిల్లలు కలిగి ఉన్న పక్షంలోనే అద్దె గర్భం ద్వారా సన్నిహిత బంధువులైన దంపతులకు సంతానం కోసం సాయపడేందుకు ఆ మహిళకు అనుమతి లభిస్తుంది.


views: 664

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams