Current Affairs Telugu Daily

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

*  దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ అన్షులా కాంత్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు.
* ప్రపంచ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులయ్యారు.
*  ఈ మేరకు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్  ఒక​ ప్రకటన జారీ చేశారు. గత ఏడాదే  కాంత్ ఎండీగా నియమితులయ్యారు.
*  ఎస్‌బీఐ ఎండీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా  ఉన్న ఆమె సుమారు 38 బిలియన్ డాలర్ల (రూ.2.3 లక్షల కోట్లు) ఆదాయాన్ని, 500 బిలియన్ డాలర్ల (రూ.35 లక్షల కోట్లు) ఆస్తులను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 
*  ప్రపంచ బ్యాంకు ఎండీ, సీవోవోగా కాంత్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక, రిస్క్ మేనేజ్‌మెంట్ బాధ్యత వహిస్తారు, రాష్ట్రపతికి నివేదిస్తారని తెలిపారు.
*  అన్షులాకు ఉన్న అనుభవం నేపధ్యంలో ఆమెకు సాధారణ నిర్వాహణ వ్యవహారాలతో పాటు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్‌ బాధ్యతలను అప్పగించారు
*  లేడీ శ్రీరాం కాలేజ్ ఫర్ విమెన్ నుంచి ఎకనమిక్స్ హానర్స్  చేసిన అన్షులా కాంత్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
*  1960లో జన్మించిన ఆమె 1983లో ఎస్‌బీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా పనిచేశారు.


views: 804Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams