Current Affairs Telugu Daily

ఆలిండియా ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

* ఆలిండియా సబ్‌ జూనియర్‌ (అండర్‌–13) ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు ఎన్‌. ప్రణవ్‌ రామ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
*  గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో ప్రణవ్‌ బాలుర సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌తో పాటు డబుల్స్‌తో తన భాగస్వామి రామ్‌ ప్రసాద్‌తో కలిసి రన్నరప్‌గా నిలిచాడు.
* బాలుర సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ ప్రణవ్‌ 21–11, 20–22, 21–19తో అంకరన్‌ శర్మ (హరియాణా)పై గెలుపొందాడు. 
* ఫైనల్లో టాప్‌సీడ్‌ నవ్య 19–21, 19–21తో రెండో సీడ్‌ ఉన్నతి హుడా (హరియాణా) చేతిలో ఓడీ౦ది 
* బాలుర డబుల్స్‌ విభాగంలో టాప్‌సీడ్‌ ప్రణవ్‌ రామ్‌–సాయిప్రసాద్‌ (తెలంగాణ) ద్వయం 13–21, 21–12, 12–21తో అహంథమ్‌ కాస్పరోవ్‌–బోరిశ్‌ సలామ్‌ (మణిపూర్‌) చేతిలో ఓడిపోయి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 
*  బాలికల డబుల్స్‌ టైటిల్‌ పోరులో నవ్య (ఆంధ్రప్రదేశ్‌)–శ్రీవన్షి (తెలంగాణ) జంట 15–21, 21–10, 21–16తో టాప్‌సీడ్‌ ఉన్నతి (హరియాణా)–దివిత (ఆంధ్రప్రదేశ్‌) జోడీకి షాకిచ్చింది.


views: 709

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams