Current Affairs Telugu Daily

ఫేస్‌‌బుక్‌కు రూ. 34 వేల కోట్ల జరిమానా

* వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని లీక్‌ చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు అమెరికా నియంత్రణ సంస్థలు భారీ జరిమానా విధించనున్నాయి.
* సోషల్‌ నెట్‌వర్క్‌ల గోప్యత, సమాచార రక్షణలో లోపాలు వంటి కారణాలకు గానూ ఫేస్‌బుక్‌పై జరిమానా విధించేందుకు ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టీసీ) సిద్ధమవుతోంది.
*  దర్యాప్తు సెటిల్‌మెంట్‌లో భాగంగా ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌పై రూ.34,280 కోట్ల (5 బిలియన్‌ డాలర్లు) జరిమానా విధించనుంది.
*  దీనికి సంబంధించిన వివరాలను వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనంలో ప్రచురించింది.
* వ్యక్తిగత భద్రతా వైఫల్యాలకు ఓ సంస్థపై ఎఫ్‌టీసీ ఇంత భారీజరిమానా విధించడం ఇదే తొలిసారి.
*  దీనికి అమెరికా న్యాయశాఖ ఇంకా ఆమోదించలేదు.
* సెటిల్‌మెంట్‌లో భాగంగా వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఫేస్‌బుక్‌కు కొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది.
*  వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు 2011లో ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌తో ప్రైవసీ సెటిల్‌మెంట్‌ చేసుకుంది.
* దీని ప్రకారం వినియోగదారుల సమాచారాన్ని తమ వ్యాపార భాగస్వామ్య సంస్థలకు అందించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అలా చేయని పక్షంలో జరిమానా విధించే హక్కు ఉంటుంది.

  • ఫేస్‌బుక్‌ను మార్క్ జకర్‌బర్గ్ , ఎడ్యుర్డో సావెరిన్, డస్టిన్ మోస్కోవిట్జ్ మరియు క్రిస్ హ్యూగ్స్‌తో కలసి ఆరంభించారు.
  • ఫేస్‌బుక్‌ను స్థాపించింది- 2004.

views: 641

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams