Current Affairs Telugu Daily

చైనా లో 1992 తర్వాత అతితక్కువ వృద్ధిరేటు

* చైనా ఆర్థిక వ్యవస్థ 1992 తర్వాత అతితక్కువ వృద్ధిరేటును నమోదు చేసింది.  
* ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికానికి కాను 6.2శాతం వృద్ధిరేటును నమోదు చేసింది.
* గతంలో నమోదు చేసిన 6.4శాతం కంటే ఇది 0.2శాతం తక్కువ. గత ఏడాది ఇదే సీజన్‌లో 6.3శాతంగా ఇది ఉంది. 
* ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు చైనా ఇప్పటికే వడ్డీరేట్లను తగ్గించి రుణలభ్యతను పెంచింది.
*  దీంతో జూన్‌లో కొంత పెట్టుబడులు పెరిగాయి. కానీ గత  ఏడాదితో పోలిస్తే జూన్‌లో ఎగుమతులు పడిపోయాయి.
* అమెరికాతో వాణిజ్య చర్చలు విఫలం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
* ఇప్పటికే చైనా దేశీయ కంపెనీలకు 291 బిలియన్ల మేరకు పన్ను రాయితీలు, ఫీజుల తగ్గింపును అందించింది.
* ఈ త్రైమాసికంలో వాణిజ్య చర్చల్లో నెలకొన్న ఉత్కంఠభరిత పరిస్థితితో చైనా కంపెనీల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ‘‘చైనా ఆర్థిక వ్యస్థలో తీవ్రమైన ఊగిసలాట ధోరణి నెలకొంది’’ అని చైనా చీఫ్‌ ఎకానమిస్ట్‌ టింగ్‌ లూ వెల్లడించారు.
* జీడీపీ వృద్ధిరేటును చైనా 6-6.5శాతం మధ్య నమోదు చేయించడానికి ఈ సారి వడ్డీరేట్లను మరింత తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 
*  చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందనడానికి చాలా చిహ్నాలు  కనబడుతున్నాయి.
*  అమెరికాతో వాణిజ్య యుద్ధం కారణంగా నెలకొన్న పరిస్థితితో చైనాలో దేశీయ రిటైల్‌ కొనుగోళ్లు కూడా తగ్గించుకొన్నారు.
* ఇవి 8.1శాతం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. 15ఏళ్లలో ఇదే అత్యల్పం.
* ముఖ్యంగా ఇది అత్యున్నత  శ్రేణి స్మార్ట్‌ ఫోన్ల విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది.
*  దీంతో సెమీ కండక్టర్ల తయారీ, ఇతర విడి భాగాల తయారీ, దిగుమతిని తగ్గించాయి.
*  దక్షిణ కొరియా నుంచి చైనాకు వచ్చే మెమోరీ చిప్‌ల సంఖ్య కూడా తగ్గిపోయింది.
*  దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌.కె.హైనిక్స్‌ 358 మిలియన్‌ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది.
*  మరోపక్క చైనాలో పరిశ్రమలు ఉత్పత్తిలో కోత విధించడంతో చమురు డిమాండ్‌ తగ్గింది.
* దీంతో చైనా రిఫైనరీలు ఉత్పత్తి చేసే ఆయిల్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఇవన్నీ చైనా ఆర్థిక వ్యవస్థ మందగమానికి చిహ్నాలే. 


views: 724



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams