Current Affairs Telugu Daily

ప్రయోగానికి  ముందు ఆగిన 'చంద్రయాన్'
*  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాబిల్లి యాత్ర ‘చంద్రయాన్‌-2’ అనూహ్యంగా ఆగిపోయింది.
*  వాహకనౌక అయిన ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3’లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది.
* ఆ తర్వాత 2-3 నిమిషాలకే చంద్రయాన్‌-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఆపేశారు.
*  మళ్లీ ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో అధికారులు చెప్పారు. 
*  తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు షార్‌ నుంచి ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3-ఎం1’ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి ఉండేది.
* ఆపై కేవలం 16.13 నిమిషాల వ్యవధిలో చంద్రయాన్‌-2ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి ఉండేది.
*  సాధారణంగా నిర్దిష్ట సమయం(లాంచ్‌ విండో)లోనే వ్యోమనౌకను ప్రయోగించాల్సి ఉంటుంది.
* ఒకవేళ ఆ సమయంలో ప్రయోగించలేకపోతే మళ్లీ అనువైన సమయం వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే. 
* ప్రస్తుత లాంచ్‌ విండో(సోమవారం తెల్లవారుజాము)లో ప్రయోగాన్ని పూర్తిచేసేందుకు ఇస్రో తీవ్రంగా శ్రమించినప్పటికీ నిరాశే ఎదురైంది.
*  మళ్లీ ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు అనువుగా ఈ నెలలో కేవలం 1 నిమిషం నిడివి ఉన్న లాంచ్‌ విండోలే అందుబాటులో ఉన్నాయి.
*  నాటి లాంచ్‌ విండో నిడివి 10 నిమిషాలు కావడం గమనార్హం.

* షార్‌లో రూ.629 కోట్లతో నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతికి అంకితం చేశారు.
*  అనంతరం రెండో ప్రయోగ వేదిక వద్దకెళ్లి చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని పంపనున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3-ఎం1 వాహక నౌకను వీక్షించారు

views: 676

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams