Current Affairs Telugu Daily

ఏపీలో రూపాయికే పంటల బీమా

* వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా రైతులు నామమాత్రంగా రూపాయి చెల్లించి నమోదు చేయించుకుంటే.. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఉచితంగా చెల్లించబోతోంది.
*  దీనికోసం సొంతంగా వ్యవసాయ పంటల బీమా సంస్థనే ప్రారంభించబోతోంది.
* వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ఖరీఫ్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
*  సాగయ్యే ప్రతి ఎకరానికి ప్రీమియం చెల్లించేందుకు నిధులు కూడా అందుబాటులో ఉంచబోతోంది.
*  బ్యాంకుల్లో పంటరుణాలున్న వారితో పాటు.. రుణాలు పొందని రైతులు కూడా నామమాత్ర రుసుము చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
*  బ్యాంకుల ద్వారా బీమా ప్రీమియం చెల్లించే వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది.
*  రబీ నాటికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా వ్యవసాయ బీమా సంస్థ ఏర్పాటు చేయబోతోంది.
* ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సర్కారు చర్యల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల బీమా పథకం రూపురేఖలే మారిపోనున్నాయి.
* ఈ ఏడాది ఖరీఫ్‌లో 42.04 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా.
*  వాస్తవ పంటల సాగు ఎంత ఉంటే అంతకు బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెలిస్తుంది.
*  పంటరుణాలు తీసుకోని రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా నామమాత్రంగా ఒక రూపాయి చెల్లించి నమోదు చేసుకుంటే సరిపోతుంది.
*  రైతు వాటాను వ్యవసాయశాఖ జమ చేస్తుంది. సాగుదారు రూపాయి చెల్లించి పేరు, సాగు చేసిన పంట, విస్తీర్ణం, భూమి వివరాలు నమోదు చేయించుకుంటే చాలు.
*  రాష్ట్రమే సొంతంగా బీమా సంస్థను ఏర్పాటు చేస్తే ఇతర బీమా సంస్థల పై ఆధారపడాల్సిన అగత్యం ఉండదు. పరిహారం విడుదలపై నిర్ణయం సర్కారు చేతిలోనే ఉంటుంది.
* రైతులు ఏప్రిల్‌, మే నెలల నుంచే బ్యాంకుల్లో కొత్త రుణాలు తీసుకోవడం, పాత రుణాలకు వడ్డీలు చెల్లించి కొత్తవాటిగా మార్చుకోవడం ప్రారంభించారు.
*  వీరందరి నుంచి పంటల వారీగా ప్రీమియం రుసుమును  బ్యాంకులు మినహాయించుకున్నాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని బ్యాంకుల వారీగా ప్రభుత్వం తిరిగి జమ చేయనుంది.
* రాష్ట్రంలో సాగయ్యే మొత్తం విస్తీర్ణంలో 40 శాతానికే ప్రీమియం రూపంలో ఏడాదికి రూ.1,498 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది.
*  పంట నష్టపోతే బీమా సంస్థల నుంచి పరిహారం రూపంలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు.
* ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే తర్వాత ఖరీఫ్‌ నాటికీ చెల్లింపులు చేయడం లేదు. ఇప్పుడు ఖరీఫ్‌, రబీలో సాగయ్యే మొత్తం విస్తీర్ణానికి పంటల బీమా చేయాలంటే రైతు వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి రూ.2,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
*  కేంద్ర వాటాతో కలిపితే మొత్తం రూ.3,500 కోట్లు అవుతుంది. ఇంత మొత్తాన్ని బీమా సంస్థలకు చెల్లిస్తే రైతుకు పరిహారంగా ఎంత తిరిగొస్తుందనేది  ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే సొంతంగా వ్యవసాయ బీమా సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది.
*  రబీ నుంచే దీన్ని ప్రారంభించనుంది. అంటే ఇక మీదట పంట నష్టపోయిన సందర్భాల్లో పరిహారం చెల్లింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. రైతులకు వెంటనే అందేందుకు వీలుంటుంది.


views: 894



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams