Current Affairs Telugu Daily

రోహిత్ శర్మ కు 2019 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ గోల్డెన్ బ్యాట్ 
*  ప్రపంచకప్‌లో భారత ఆటగాడు రోహిత్‌ శర్మ గోల్డెన్‌ బ్యాట్‌ను అందుకోనున్నాడు.
* సెమీఫైనల్లో భారత్‌ నిష్క్రమించినా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అతడే అగ్రస్థానంలో ఉండటం విశేషం.
* గోల్డెన్‌ బ్యాట్‌ను అందుకునే భారత మూడో ఆటగాడిగా  రోహిత్‌ రికార్డు సృష్టించనున్నాడు.
*  రోహిత్‌ కంటే ముందు సచిన్‌ (1996, 2003), రాహుల్‌ ద్రావిడ్‌ (1999) ఈ ఘనత సాధించారు.
*  ఈ ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాదిన రోహిత్‌ 81 సగటుతో 648 పరుగులు సాధించాడు.
*  ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగానూ రోహిత్‌ రికార్డు సృష్టించాడు.
*  ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌ (647) రెండో స్థానంలో ఉండగా బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్ షకిబ్‌ అల్‌ హసన్‌ (606) మూడో స్థానంలో ఉన్నాడు.

views: 721

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams