Current Affairs Telugu Daily

ఐపీఎల్ విస్తరణకు సన్నాహాలు
* 2008లో ఎనిమిది జట్లతో మొదలైన ఈ మెగా టోర్నీ 2019 తో మొత్తం 12 వసంతాలు పూర్తి చేసుకుంది. 
* ప్రస్తుతానికి 8 జట్లకే పరిమితమైన ఈ టోర్నీలో మరో రెండు జట్ల సంఖ్య పెంచే ఆలోచనలో ఫ్రాంచైజీలు ఉన్నట్లు తెలిసింది.
*  దీనికి సంబంధించి ఆయా జట్ల యాజమాన్యం తాజాగా లండన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకొని చర్చించినట్లు తెలిసింది.
* 2011లో కేరళ టస్కర్స్‌, పూణె వారియర్స్‌ పేరుతో రెండు ఫ్రాంచైజీలు టోర్నీలోకి అడుగుపెట్టాయి.
* ఫలితంగా జట్ల సంఖ్య 10కి చేరింది.
*  కానీ బీసీసీఐతో ఒప్పంద కారణాలతో రెండు సీజన్ల తర్వాత ఆ రెండు టోర్నీ నుంచి వైదొలిగాయి.
* దీంతో 2014 నుంచి ఎనిమిది జట్లే కొనసాగుతున్నాయి. 
* ‘ఐపీఎల్‌కు ఉన్న ఆదరణతో తాజా సమావేశంలో మళ్లీ జట్ల సంఖ్య పెంచాలనే విషయంపై పూర్తిస్థాయి చర్చ జరిగింది.
*  బీసీసీఐదే అంతిమ నిర్ణయం. జట్ల సంఖ్య పెరిగితే ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించాల్సి వస్తుంది.
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ (సంక్షిప్తంగా IPL), ఇది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చే సృష్టించబడిన ఒక ట్వంటీ 20 క్రికెట్ పోటీ
*BCCI ఉపాధ్యక్షుడు లలిత్ మోడి IPL యొక్క ఛైర్మన్& కమిషనర్ గా ఉన్నారు.
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క మొదటి సీజన్ ఆటలు 2008 ఏప్రిల్ 18న ప్రారంభమయ్యాయి, 

views: 711



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams