Current Affairs Telugu Daily

జకోవిచ్‌ 'నాలుగోసారి' వింబుల్డన్ టైటిల్‌ 
 * వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(31) టైటిల్‌ను గెలుచుకున్నాడు.
*  కెరీర్‌లో నాలుగో వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
*  మొత్తంగా అతనికి 13వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.
*  2011, 2014, 2015లలో జకోవిచ్ వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచాడు.
*వింబుల్డన్‌  జరిగిన తుదిపోరులో జకోవిచ్ 6-2, 6-2, 7-6(3) తేడాతో దక్షిణాఫ్రికా స్టార్, ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్‌పై విజయం సాధించాడు.
*  ఈ టోర్నీలో అండర్సన్‌కు ఇదే తొలి వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం.
* సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ కెరీర్‌లో ఇది ఐదో వింబుల్డన్‌ టైటిల్‌. మొత్తం మీద 16వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌.
*  వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్, లేదా సాధారణంగా వింబుల్డన్, అనేది ప్రపంచంలో అతి పురాతన టెన్నిస్ టోర్నమెంట్, ఈ టోర్నీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తారు.
* లండన్ శివారైన వింబుల్డన్‌లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో 1877 నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది.
*  నాలుగు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లలో ఇది కూడా ఒకటి, వీటిలో క్రీడ యొక్క అసలు ఉపరితలమైన, గడ్డిపై ఇప్పటికీ జరుగుతున్న ఏకైక టోర్నీ ఇదే కావడం గమనార్హం, లాన్ టెన్నిస్‌కు ఈ పేరును దీని నుంచే స్వీకరించారు.

* జూన్ మాసాంతం నుంచి జూలై మాసారంభం మధ్య కాలంలో రెండు వారాలకుపైగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది, మహిళలు మరియు పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లు వరుసగా రెండో శనివారం మరియు ఆదివారం జరుగుతాయి. 


views: 745



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams