Current Affairs Telugu Daily

కరెన్సీ నోట్లను గుర్తించేందుకు సరికొత్త యాప్:  ఆర్‌బీఐ

* దృష్టిలోపాలున్న వారు కరెన్సీ నోట్లను గుర్తు పట్టేందుకు వీలుగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
*  మొబైల్‌ కెమెరా ముందు మహాత్మా గాంధీ సిరీస్‌, మహాత్మా గాంధీ న్యూ సిరీస్‌ కరెన్సీ నోటుని ఉంచి ఫొటో తీస్తే ఆడియో రూపంలో ఆ కరెన్సీ విలువ ఎంతో అది తెలుపుతుంది.
* కెమెరా ముందు నోటును సరిగ్గా ఉంచి, ఫొటో తీస్తే ఈ సమాచారాన్ని తెలుపుతుంది.. ఒకవేళ ఫొటో సరిగ్గా తీయకపోతే ‘మరోసారి ప్రయత్నించండి’ అని చెబుతుంది.
*  ఈ యాప్‌ను అభివృద్ధి చేయడం కోసం సాంకేతిక సంస్థల నుంచి ఆర్బీఐ బిడ్‌లను ఆహ్వానించింది. 
*  ప్రస్తుతం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. మరోవైపు రూ.1 నోటు కూడా ఉంది.
*  దృష్టిలోపాలున్న వారు గుర్తుపట్టడానికి ప్రస్తుతం రూ.100 ఆపై విలువ గల నోట్లపై ఇంటాగ్లియో ప్రింటింగ్‌ ఆధారిత గుర్తులు ఉన్నాయి.
*  వారు మరింత కచ్చితంగా నోట్లను గుర్తించడానికి ఈ కొత్త యాప్‌ ఉపయోగపడనుంది. 
*  ప్రస్తుతం దేశంలో దృష్టిలోపం ఉన్నవారు 80 లక్షల మంది ఉన్నారు.
*  వారు కరెన్సీ నోట్లను గుర్తించడానికి తాము ఓ డివైజ్‌ లేదా మెకానిజంను అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తామని 2018లో ఆర్బీఐ ప్రకటించింది. 

  • RBI: Reserve Bank of India
  • Headquarters: Mumbai
  • Founder: British Raj
  • Founded: 1 April 1935, Kolkata
  • Governor: Shaktikanta Das

views: 688

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams