Current Affairs Telugu Daily

కార్గిల్ యుద్ధ వార్షికోత్సవం: విజయజ్యోతిని వెలిగించిన రాజ్‌నాథ్‌ 
* కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌  దిల్లీలోని యుద్ధస్మారకం వద్ద విజయజ్యోతిని వెలిగించారు.
* ఈ విజయజ్యోతిని మోటారుసైకిల్‌ యాత్రికుల బృందం 11 పట్టణాలు, నగరాల గుండా తీసుకెళ్లి చివరగా.. ద్రాస్‌ సెక్టార్‌లో కార్గిల్‌ యుద్ధస్మారకం వద్ద ఉన్న అమరజ్యోతిలో కలుపుతుంది.
*దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించారు.

* కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో మరియు మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది.
*  ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం, యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.
* నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది.
*  అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది.

views: 726



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams