Current Affairs Telugu Daily

బంగ్లాదేశ్‌ మాజీ నియంత ఎర్షాద్‌ కన్నుమూత
* బంగ్లాదేశ్‌ మిలటరీ మాజీ నియంత హుస్సేన్‌ మహమ్మద్‌ ఎర్షాద్‌ (91)  ఢాకాలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు.
*  ఆయన కొంత కాలంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ‘జాతీయ పార్టీ’ అధ్యక్షుడిగానూ, బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లో విపక్ష నేతగా ఉన్న ఆయన జూన్‌ 22వ తేదీన తీవ్ర ఆనారోగ్యానికి గురవడంతో స్థానిక మిలటరీ ఆసుపత్రిలో చేర్చారు.
*  హుస్సేన్‌ మహమ్మద్‌ ఎర్షాద్ 1930 సంవత్సరంలో కూచ్‌బెహర్ జిల్లా సబ్-డివిజన్‌లోని దిన్‌హతాలో జన్మించారు.
* ఆయన తల్లిదండ్రులు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు.
* 1982లో సైనిక కుట్ర ద్వారా అధికారం చేజిక్కించుకున్న ఆయన 1990 వరకు అధికా రంలోవచ్చారు. ఎర్షాద్‌ తీసుకున్న వివాదా స్పద నిర్ణయాల్లో ఒకటి ముస్లిం మెజార్టీ కలిగిన బంగ్లాదేశ్‌ను ముస్లిం మత రాజ్యంగా ప్రకటించడం.

views: 584

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams