Current Affairs Telugu Daily

 తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తమిళనాడు

* సమయానికి వర్షాలు కురువక తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తమిళనాడు రాజధాని చెన్నైకి ఊరట లభించింది.
* వేలూరు జిల్లాలోని జోలార్‌పట్టై ప్రాంతం నుంచి బయలుదేరిన నీటి రైలు  చెన్నైకి చేరుకుంది.
*  మొత్తం 50 వ్యాగన్లు కలిగిన ఈ రైలు 25 లక్షల లీటర్ల నీటిని తీసుకొని విల్లివాకంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి చేరుకుంది.
*  ఈ రైలు నుంచి నీటిని ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ప్రత్యేక పైపుల ద్వారా తరలిస్తారు.
* ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోకి నీటిని తరలించాక అక్కడి నుంచి ప్రజలకు సరఫరా చేస్తారు.
* చెన్నైలో సమృద్ధిగా వర్షాలు కురిసి రిజర్వాయర్లు నిండే వరకు దాదాపు ఆరు నెలలపాటు ఈ ఏర్పాట్లు కొనసాగనున్నాయి.
* ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానికి రాకపోవడంతో చెన్నైకి నీటిని సరఫరా చేసే నాలుగు రిజర్వాయర్లు ఎండిపోయాయి.
*  దీంతో గత ఐదు నెలలుగా చెన్నై తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో చొరవ తీసుకున్న సీఎం పళనిస్వామి నీటి సరఫరా కోసం సహకరించాలని రైల్వే శాఖను కోరారు.
* అంతేగాక నీటి సరఫరా కోసం నిధులను కేటాయించారు.
*  నీటి రైలు విల్లివాకంకు చేరుకోగానే మంత్రులు స్వాగతం పలికారు. 
*చెన్నైకి నీటి అవసరాల కోసం దాదాపు 18 ఏండ్ల తర్వాత రైలులో నీళ్లను తీసుకొస్తున్నారు.
*  2001లో ప్రస్తుతం లాగే తీవ్ర నీటి ఎద్దటి నెలకొంటే ఈ రోడ్ నుంచి రైలు ద్వారా నీటిని చెన్నైకి తరలించారు.
-ప్రస్తుతం నీళ్లను మోసుకొస్తున్న రైలు రోజుకు నాలుగుసార్లు నీటిని తీసుకొస్తుంది. అంటే రోజుకు కోటి లీటర్ల నీటిని తీసుకొస్తుందన్నది తర్వాత ప్రత్యేక పైపులైన్ల ద్వారా ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు తరలిస్తారు.ఒక్కో వ్యాగన్‌లో 50వేల లీటర్ల చొప్పున నీరు ఉంటుంది.


views: 742

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams