Current Affairs Telugu Daily

 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- 2019
* సమోవా లోని అపియాలో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు రాగాల వెంకట రాహుల్ రజతం సాధించాడు. 
* 89 కేజీ ల విభాగంలో జులై 12 న జరిగిన పోటీల్లో స్నాచ్, క్లీన్ జర్క్ లో మొత్తం 325 కెజీల బరువు ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు.
* జెరెమీ లాల్ రినుంగా  67 కేజీల పురుషుల విభాగంలో స్నాచ్ లో 136 కేజీల బరువు ఎత్తి ప్రపంచ యూత్, ఆసియా, కామన్వెల్త్ లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
*  గతంలో తన పేరిట ఉన్న 134 కెజీ ఆసియా రికార్డులను తిరగరాశాడు. 
* క్లీన్ అండ్ జర్క్ లో విఫలమైన జెరెమీ పతకం గెలవలేకపోయాడు. 
* మహిళల విభాగంలో మన్ ప్రీత్ కౌర్ 76 కేజీల పసిడి నెగ్గింది. 
* యూత్ కేటగిరి 81 కిలోల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఉక్కాయపల్లె కు చెందిన ఆడికిబోయిన శివరామకృష్ణ యాదవ్ స్వర్ణం సాధించాడు. 

views: 783

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams