Current Affairs Telugu Daily

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు  మరో 30 వేల కోట్లు
* కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు మరో 30 వేల కోట్లు వ్యయమవుతుందని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయమంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు. 
* జూన్ 2019 నాటికి ఈ ప్రాజెక్ట్ పై 50,481 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. 
* తెలంగాణలో సత్వర నీటి ప్రయోజనాల నిమిత్తం 11 ప్రాజెక్టులకు 2016-19 సంవత్సరాల మధ్య రూపాయలు 560.67 కోట్లు కేంద్ర సహాయం విడుదల చేసినట్లు జల్ శక్తి శాఖ సహాయమంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు.
* కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు.

* ఆయకట్టు 45,000 ఎకరాలు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం.
*  తెలంగాణ  రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది
*కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు.
*  తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది.
*  గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు ఏత్తిపోయడం ఈ పథకం ఉద్దేశం.
*  వందల కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతలు, ఆసియాలోనే అతి పెద్ద ఎగసిపడేనీటి జలాశయము (సర్జి పూల్) ఏర్పాటు, భూగర్భం లోనే నీటిపంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం.

  • ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం - 80,500 కోట్లు
  • నిర్మాణాలు - 3 బ్యారెజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్లు
  • జిల్లాలు - 13
  • నీటీ నిల్వసామర్ద్యం - 140టీఎంసీ
  • ప్రధాన కాలువల డిస్టిబ్యూషన్ పొడవు - 1531కి.మీ
  • సొరంగాల పొడవు - 203కి.మీ
  • మొత్తం పంపులు - 82
  • అవసరమైన విద్యుత్తు - 4627.24
  • భూ సేకరణ - 80వేల ఎకరాలు
  • అటవి భూమి - 3050హెక్టార్లు
  • కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు
  • నిర్వాసిత కుటుంబాలు-6200

మొత్తం 12 బ్లాక్లుగా ప్రాజెక్టును విభజించారు.

  • మేడిగడ్డ బ్యారేజి.
  • మేడారం బ్యారేజి.
  • మేడారం ఎత్తిపోతలు.
  • అన్నారం బ్యారేజి.
  • అన్నారం ఎత్తిపోతలు..
  • సుందిళ్ళ బ్యారేజి.
  • సుందిళ్ళ ఎత్తిపోతలు.
  • ఎల్లపల్లి నుంచి నంది మేడారం వద్ద గల మేడారం బ్యారేజి కు నీటీని మళ్ళించడం.
  • మేడారం రిజర్వాయర్ నుంచి సొరంగ మార్గం.
  • రాగం పేట వద్ద పంప్ హౌస్ నిర్మించడం.
  • మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని మల్లిచడం.
  • మధ్యమానేరు నుంచి అప్రోచ్ కాలువ త్రవ్వి హెడ్ రెగ్యులేటర్ నిర్మించడం.
  • అనంతగిరి రిజర్వాయర్ నుంచి అప్రోచ్ కాలువను నిర్మిచడం.
  • రంగనాయక సాగర్ నుంచి అప్రోచ్ కాలువను నిర్మిచడం.

views: 738

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams