Current Affairs Telugu Daily

 భారత్‌లో ఆప్టికల్‌ ఫైబర్‌ ‘5జీ’ 
* హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించే 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కీలకమైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ (ఓఎఫ్‌సీ)కు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది.
*  టెలికం శాఖ అంచనాల ప్రకారం 2018లో ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ సుమారు 1.4–1.5 మిలియన్‌ కేబుల్‌ రూట్‌ కిలోమీటర్స్‌ మేర విస్తరించి ఉంది.
*  ఇంటర్నెట్‌ విస్తృతిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరాలంటే 2022 నాటికి ఈ నెట్‌వర్క్‌కు దాదాపు నాలుగు రెట్లు అధికంగా 5.5 మిలియన్‌ కేబుల్‌ రూట్‌ కిలోమీటర్స్‌ మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ వేయాల్సి ఉంటుంది.
* ఇందుకోసం ఏకంగా రూ. 1,80,000 కోట్ల స్థాయిలో పెట్టుబడులు అవసరం.
*  టెలికం సంస్థలు ప్రధానంగా టవర్ల పెంపునకు అవసరమైన ఫైబర్‌ కేబుల్స్‌ వేయడంపైనే ముందుగా దృష్టి పెట్టాల్సి రానుండటంతో ఈ పెట్టుబడుల్లో సింహభాగం వాటా ప్రభుత్వమే భరించాల్సి రానుంది.
* 5జీ సేవలను ముందుగా పెద్ద నగరాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో వచ్చే రెండు, మూడేళ్లలో టవర్స్‌ సంఖ్య 5,00,000 నుంచి 7,50,000కు పెంచుకోవాల్సిన అవసరం ఉందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ తెలిపారు.
*  ఇందులో 70 శాతం టవర్స్‌కు అవసరమైన ఫైబర్‌ కేబుల్‌ వేయాలంటేనే దాదాపు రూ. 50,000 కోట్లు అవసరమని ఆయన పేర్కొన్నారు.  
* ఇంత భారీ స్థాయిలో ఓఎఫ్‌సీ వినియోగించాల్సి రావడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా 5జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం చాలా శక్తిమంతమైనదే అయినా దాని పరిధి చాలా పరిమితంగా ఉంటుంది.
* దీంతో మరింత పెద్ద సంఖ్యలో టవర్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
*  4జీతో పోలిస్తే 5జీ కోసం 3 రెట్లు ఎక్కువగా టవర్స్‌ అవసరమవుతాయని ఓఎఫ్‌సీ తయారీ దిగ్గజం హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌  చైర్మన్‌ మహేంద్ర నహతా తెలిపారు.
*  ఇక రెండో కారణం విషయానికొస్తే.. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టవర్లలో కేవలం 20% టవర్స్‌కి మాత్రమే ఫైబర్‌ కేబుల్స్‌ ఉపయోగిసున్నారు.
* 5జీ సేవలను సముచిత స్థాయిలో అందించాలంటే వచ్చే మూడేళ్లలో దీన్ని కనీసం 70 శాతానికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని మాథ్యూస్‌ చెప్పారు.
* మరోవైపు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకోసం కూడా ఓఎఫ్‌సీ అవసరం. ఇక రిలయన్స్‌ జియో ప్రకటించిన ఫైబర్‌ టు హోమ్‌ సర్వీసుల కోసం కూడా భారీ స్థాయిలో ఓఎఫ్‌సీ కావాల్సి ఉంటోంది.
* వచ్చే మూడేళ్లలో సుమారు 1,600 నగరాల్లో 7.5 కోట్ల మందికి టీవీ, వాయిస్, డేటా సేవలను అందించే దిశగా రిలయన్స్‌ జియో ప్రయత్నాలు చేస్తోంది.
* ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై స్పీడ్‌ డేటా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ బ్రాడ్‌బ్యాండ్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కూడా ఓఎఫ్‌సీ చాలా కీలకం.
* తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు కూడా ప్రజలకు చౌక బ్రాడ్‌బ్యాండ్‌ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
*  తెలంగాణ ప్రభుత్వం టీ–ఫైబర్‌ పేరిట 12,700 పంచాయతీల్లో 2 కోట్ల  జనాభాకు బ్రాడ్‌ బ్యాండ్‌ను అందుబాటులోకి తెచ్చే  ప్రయత్నం చేస్తోంది.
* ఓఎఫ్‌సీకి ఇంత భారీ డిమాండ్‌ ఉన్నప్పటికీ టెల్కోలు కేబుల్‌ వేయడంలో టెల్కోలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి.
*  రహదారులను తవ్వి కేబుల్స్‌ వేయాలంటే చాలా వ్యయాలతో కూడుకున్నదిగాను, మున్సిపాలిటీల నుంచి అనుమతులు పొందటం కష్టతరంగాను ఉంటోందని టెలికం వర్గాలు తెలిపాయి.
* ఆప్టికల్ ఫైబర్  ఒక మానవ వెంట్రుక కంటే కొద్దిగా మందంగా బలవంతపు గాజు లేదా ప్లాస్టిక్ లాంటి  ఒక సౌకర్యవంతమైన, పారదర్శక ఫైబర్ వుంటుంది.
* ఆప్టికల్ ఫైబర్ అనేది మొట్ట మొదటిగా 1840 లో పారిస్లోలో డేనియల్ కోల్లాడ్ణ్ మరియు జాక్వెస్ బేబీ నెట్ ద్వారా కనుగొన్నారు..ఆ తరువాత జాన్ టిండాల్ అనే శాస్త్రవేత్త  అభివృద్ధి చేసారు.

views: 875



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams