Current Affairs Telugu Daily

టీవీఎస్‌ నుంచి ఇథనాల్‌తో నడిచే బైక్‌

*  ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టీవీఎస్‌ మోటార్‌  తాజాగా తన పాపులర్‌ మోడల్‌ అపాచీలో ‘ఇథనాల్‌’ వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
*  ‘అపాచీ ఆర్‌టీఆర్‌ 200 ఫై ఈ100’ పేరిట  విడుదలైన ఈ అధునాతన బైక్‌... ఇథనాల్‌ ఇంధనం ఆధారంగా నడుస్తుంది.
* ప్రారంభ ధర రూ.1.2 లక్షలు. దేశవ్యాప్తంగా ఇథనాల్‌ అందుబాటులో లేనందున ప్రస్తుతానికి చెరుకు పంటకు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో ఈ బైక్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలియజేసింది.
* ‘ద్విచక్ర వాహన పరిశ్రమ పెట్రోల్, డీజిల్‌ బైక్‌ల నుంచి నెమ్మదిగా పర్యావరణ అనుకూల ఇంధనాలవైపునకు అడుగులు వేస్తోంది.
* కంపెనీలు విద్యుత్, హైబ్రిడ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల దిశగా దృష్టి సారిస్తున్నాయి.
* పెట్రోల్‌ బంకుల మాదిరిగా త్వరలోనే దేశవ్యాప్తంగా ఇథనాల్‌ పంప్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.
 


views: 664

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams