Current Affairs Telugu Daily

టెన్‌పిన్‌ బౌలింగ్‌ అసోసియేషన్ తెలంగాణలో ప్రారంభమైంది

* రాష్ట్రంలో టెన్‌పిన్‌ బౌలింగ్‌ను మరింత ప్రోత్సహించడానికి  టెన్‌పిన్‌ బౌలింగ్‌ సంఘంను ఏర్పాటును రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌  ప్రారంభించారు
*  పబ్లిక్‌ ,ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో అన్నిరకాల క్రీడలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
*  బంజారాహిల్స్‌ పార్క్‌హయత్‌ హోటల్‌లో  టెన్‌పిన్‌ బౌలింగ్‌ అసోసియేషన్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
* ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు రాహుల్‌రెడ్డి మాట్లాడుతూ అత్యంత కచ్చితత్వంతో కూడిన ఈ క్రీడలో ఔత్సాహికులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
*  బౌలింగ్‌ సమాఖ్యకు అనుబంధంగా పనిచేస్తున్నామని అన్నారు.
* ఆగస్టు నుంచి పలు పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.
*  ఈ కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర రెడ్డి, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ దాసరి, కమిటీ సభ్యులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. 
* టెన్‌పిన్ బౌలింగ్ ఫెడరేషన్ (ఇండియా) ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1860 క్రింద నమోదు చేయబడిన లాభాపేక్షలేని సంఘం.
*  బౌలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1975 లో స్థాపించబడింది.
*  ఈ సంస్థను 2007 లో టెన్పిన్ బౌలింగ్ ఫెడరేషన్ (ఇండియా) గా మార్చారు.
* TBFI ను 16 జనవరి 1998 న యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ గుర్తించింది


views: 772



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams