Current Affairs Telugu Daily

టర్కీ చేరిన రష్యా ఎస్‌–400 క్షిపణులు

*  అమెరికా హెచ్చరికలు భేఖాతరు చేస్తూ రష్యా తయారీ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌–400 క్షిపణులను టర్కీ కొనుగోలు చేసింది.
*  కొనుగోలులో భాగంగా మొదటి దశ క్షిపణులు  టర్కీ రాజధాని అంకారాకు చేరుకున్నాయి.ఈ మేరకు టర్కీ రక్షణ శాఖ వెల్లడించింది.
*  రష్యా నుంచి ఎస్‌–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా ఇప్పటికే అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే.
* ఇక తాజా కొనుగోలుతో అమెరికా, టర్కీల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.
*  ఈ కొనుగోలుకు సంబంధించి టర్కీని అమెరికా  హెచ్చరించింది. 
*  జూలై 31లోగా కొనుగోలును రద్దు చేసుకోకుంటే ఎఫ్‌–35 యుద్ధ విమానాలపై టర్కీ ఆశలు వదులుకోవాల్సిందేనని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.
*  అలాగే వీటిని నడపడానికి అమెరికాలో శిక్షణ తీసుకుంటున్న టర్కీ పైలెట్లను వెనక్కి పంపిస్తామని పేర్కొంది. అయితే ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని టర్కీ రష్యా నుంచి కొనుగోళ్లకే మొగ్గు చూపడం అమెరికాకు ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది.
* ర‌ష్యా ఎస్‌-400 సిస్ట‌మ్స్ ఉన్న ద‌గ్గ‌ర త‌మ ఎఫ్‌35 విమానాలు ఉండ‌రాద‌ని అమెరికా వాదిస్తున్న‌ది.
*  ఎందుకంటే త‌మ ఫైట‌ర్ జెట్ల‌ను రష్యా హ్యాక్ చేస్తుంద‌ని అమెరికా అభిప్రాయ‌ప‌డింది.
* అయితే ఎస్‌400 క్షిప‌ణ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ర‌ష్యా నుంచి భార‌త్ కూడా కొనుగోలు చేయ‌ల‌నుకున్న‌ది.
*  భార‌త్‌కు కూడా అమెరికా గ‌తంలోనే వార్నింగ్ ఇచ్చింది.
*  టర్కీ రాజధాని అంకారా.
* టర్కీ రాష్ట్రపతి; రిసెప్ తయ్యిప్ ఎర్డోకాన్


views: 680

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams