Event-Date: | 12-Jul-2019 |
Level: | International |
Topic: | Places in News |
* కెనెడాలో జేడీ కాంపోజిట్స్ అని ఓ నిర్మాణ కంపెనీ నోవా స్కాటియా అనే ప్రాంతంలో ఈ వినూత్నమైన ఇంటిని నిర్మించారు.
* సుమారు ఆరు లక్షల పన్నెండు వేల పెట్ బాటిళ్లను కరిగించి చిన్న చిన్న గుళికలుగా మార్చడంతో ఈ ఇంటి నిర్మాణం ప్రారంభమైంది.
* ఆర్మాసెల్ అనే కంపెనీ ఈ ప్రక్రియను చేపట్టింది.
* గుళికలన్నింటినీ ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా ప్రీఫ్యాబ్రికేటెడ్ గోడలుగా మార్చారు.
* ఆ తరువాత వాటిని డిజైన్ ప్రకారం అమర్చడంతో ఇల్లు రెడీ అయింది.
* ఒక బెడ్రూమ్, రెండు బాత్రూమ్లు, ఆధునిక వంటగదితోపాటు పైకప్పుపై బీబీక్యూ రూమ్ కూడా ఉన్న ఈ ఇంటి పేరు బీచ్హౌస్.
* ఇందులో వాడిన ప్యానెళ్లను పరీక్షించినప్పుడు అవి గంటకు 324 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకుని నిలబడుతుందని తేలింది.