Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో ఎస్‌అండ్‌పీ కేంద్రం
*  భారత్‌లో విస్తరించే వ్యూహంతో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ హైదరాబాద్‌లో మరో కార్యాలయాన్ని ప్రారంభించింది.
 అంతర్జాతీయంగా క్యాపిటల్‌, కమొడిటీ మార్కెట్లకు రేటింగులు, బెంచ్‌మార్క్‌, విశ్లేషణ, సమాచారాన్ని అందించే ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
*  రేటింగ్స్‌, అనలిటిక్స్‌, డేటా సేవలను అందిస్తోన్న ఈ సంస్థ  గ్లోబల్‌ ఇండియా ఆపరేషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ తోమర్‌ తెలిపారు.
*  ఈ ఓరియన్‌ టెక్నాలజీ కేంద్రం అభివృద్ధి, నిర్వహణ అప్పగింత కోసం 2017లో నెస్‌ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
* ఇందులో భాగంగా ఇప్పుడు ఈ కేంద్రం పూర్తిస్థాయిలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ కిందకు బదిలీ అయ్యిందని పేర్కొన్నారు. ఈ కేంద్రం కోసం ఇప్పటి వరకూ దాదాపు 10మిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టినట్లు వివరించారు.
* మరో 150 మంది ఉద్యోగులనూ తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు.
* ఇక్కడ నుంచి అంతర్జాతీయంగా సేవలు అందించనున్నట్లుఈ సంస్థ  గ్లోబల్‌ ఇండియా ఆపరేషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ తోమర్‌ తెలిపారు.
*  భారత్‌లో ఇప్పటికే ఉన్న క్రిసిల్‌కు ఇది తన వంతుగా తోడ్పాటునందిస్తుందన్నారు.
*  నెస్‌ సీఈఓ పౌల్‌ లంబార్డో మాట్లాడుతూ.. గత దశాబ్దకాలంగా ఎస్‌అండ్‌పీకి అవసరమైన సాంకేతిక సహాయాలు అందిస్తున్నామని, కొత్తగా కుదిరిన ఒప్పందంతో మరిన్ని కొత్త సేవలుఅందించేందుకు మార్గం ఏర్పడిందని పేర్కొన్నారు.
*  ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌స్థాపించబడిన౦ది : 1860.
*  ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ వ్యవస్థాపకుడు :హెన్రీ వర్నమ్ పూర్.
*  ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ప్రధాన కార్యాలయం : న్యూయార్క్ నగరం.

views: 792



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams