Current Affairs Telugu Daily

తాత్కాలిక క్యాంపస్‌ల్లోనే ఉన్నత విద్యాసంస్థలు

 * తిరుపతి ఐఐటీ, తాడేపల్లిగూడెం నిట్‌, విశాఖపట్నం ఐఐఎం, తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌, అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం, విజయనగరంలోని గిరిజన విశ్వవిద్యాలయాలు తాత్కాలిక క్యాంపస్‌ల్లో నడుస్తున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు.
*  తిరుపతి ఐఐటీ ఫేజ్‌-ఏ శాశ్వత భవనాలు మార్చి 2020నాటికి, నిట్‌ భవనాలు డిసెంబరు2020, ఐఐఎంవి జూన్‌ 2021కి, ఐఐఎస్‌ఈఆర్‌ భవనాలు డిసెంబర్‌ 2021 నాటికి పూర్తవుతాయని తెలిపారు.
*  ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మరోసారి ఈనెల 8న లోక్‌సభలో బిల్లు పెట్టారని మంత్రి తెలిపారు. 
*  ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరతా అభియాన్‌ (పీఎంజీదిశా)లో భాగంగా ఏపీలో 20.28 లక్షల మందిని డిజిటల్‌ అక్షరాస్యులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.


views: 731

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams