Current Affairs Telugu Daily

వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో ద్యూతీ రికార్డు
* భారత స్టార్‌ స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌ సంచలన ప్రదర్శన నమోదు చేసింది.
*  ఈ ఒడిశా అథ్లెట్‌ ఇటలీలోని నపోలిలో జరిగిన వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో 100 మీటర్ల రేసులో స్వర్ణ పతకం సాధించింది.
* 23 ఏళ్ల ద్యూతీ ఫైనల్‌ రేసును 11.32 సెకన్లలో ముగించి చాంపియన్‌గా నిలిచింది.
* దీంతో ఈ టోర్నీలో పసిడి పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా ద్యూతీ రికార్డు సృష్టించింది.
*  స్విట్జర్లాండ్‌కు చెందిన డెల్‌ పోంటె (11.33 సె)కు రజతం, జర్మనీ అథ్లెట్‌ లిసా క్వాయే (11.39 సె)కు కాంస్యం దక్కాయి.

views: 709

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams