Current Affairs Telugu Daily

శ్మశాన వాటికల అభివృద్ధికి గంభీర్‌ వేతనం విరాళం
* మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ఎంపీ గౌతమ్‌ గంభీర్‌  తన నియోజకవర్గంలోని శ్మశాన వాటికల అభివృద్ధికి ఎంపీ హోదాలో లభించే వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు  గౌతమ్‌ గంభీర్‌  ప్రకటించాడు.
* ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున గంభీర్‌ తూర్పు ఢిల్లీ నియోజకవర్గ ఎంపీగా గెలుపొంది    శ్మశాన వాటికల అభివృద్ధికి  విరాళంగా ఇస్తున్నట్టు  గౌతమ్‌ గంభీర్‌  ప్రకటించాడు. ‘ ఎంపీ హోదాలో నేను అందుకునే ప్రతి పైసాను నియోజకవర్గం అభివృద్ధికే వెచ్చించాలని నిర్ణయించుకున్నా. అందులో భాగంగానే నా వేతనాన్ని శ్మశానవాటికల అభివృద్ధి కోసం అందజేస్తున్నా’ అని గంభీర్‌  ప్రకటించాడు.
*1981 అక్టోబర్ 14 న ఢిల్లీ లోజన్మించిన గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ లొ 2003 నుంచి వన్డేలలో, 2004 నుంచి టెస్టులలో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
*  దేశవాళీ క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలను సాధించి టెస్ట్ జట్టులో సెలెక్ట్ అయ్యాడు.
* స్వదేశంలో జరిగిన టూర్ గేమ్ లో డబుల్ సెంచరీ సాధించిన 4 వ భారతీయుడితను. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ టెండుల్కర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
* డిసెంబర్ 2018,  గౌతమ్‌ గంభీర్‌ అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 
* భారతదేశపు నాల్గవ అతి ఉన్నత అవార్డు  అయిన పద్మశ్రీ గంభీర్ కు  ప్రదానం చేశారు.

views: 663Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams