* 2018 అంచనాల మేరకు భారత జనాభా 133.92 కోట్లు. చైనాలో 138.64 కోట్ల మంది ఉన్నారు.
* వీటి మధ్య తేడా 4.72 కోట్లే. ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ సందర్భంగా భారత జనాభాకు సంబంధించిన మరికొన్ని విశేషాలు
* 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121 కోట్లు. ప్రపంచ జనాభాలో ఇది 17.7.
* ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం.. 2021 జనగణనలో భారత్ చైనాను మించిపోవచ్చు.
* 2020 కల్లా భారత జనాభాలో 64% యువతే ఉండనుంది. ప్రపంచంలో అత్యధికంగా యువకులు ఉన్న దేశంగా భారత్ నిలవనుంది.
* కుటుంబ నియంత్రణపై శ్రద్ధ లేకపోవడం వంటి కారణాలతో భారత్లో జనాభా నియంత్రణలో లేదనేది ఐరా స, ఇతర సంస్థల అభిప్రాయం. దీనివల్ల నిరుద్యోగం, పౌష్ఠికాహారలోపం, మాతాశిశు మరణా లు పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
* 2021 జనాభా లెక్కలకు ఈ ఏడాది ఆగస్టు 12న అంకురార్పణ జరగనుంది. రెండు దశల్లో జనగణనకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
* ఈ సారి జనగణనకు 33 లక్షల మందిని నియమిస్తుండగా.. పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడనున్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సిబ్బం ది ఎప్పటికప్పుడు వివరాలను అప్లోడ్ చేస్తారు.
* ప్రపంచంలోకెల్లా అత్యధిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ లలిత్మోహన్ పంథ్.
* డాక్టర్ లలిత్మోహన్ పంథ్ 1982 నుంచి 10 లక్షలకు పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.
views: 691