భారత తీరప్రాంత గస్తీదళాన్ని (కోస్ట్‌గార్డ్) మరిం త బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా విశాఖపట్నంలో ‘ఎయిర్ ఎనక్లేవ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు డీఐజీ అనిల్‌కుమార్ హరబోలా తెలిపారు.
* కోస్ట్‌గార్డ్ డేను పురస్కరించుకుని తీరప్రాంత ని గస్తీకి విమానాలు కూడా ఉపయోగిస్తున్నామని, విశాఖలో ప్రత్యేక స్థావరం లేకపోవడంతో అవి చెన్నై నుంచి వచ్చి వెళ్తున్నాయని చెప్పారు.
* విశాఖ కేంద్రంగా కోస్ట్‌గార్డ్ ఎయిర్ ఎనక్లేవ్ ప్రతిపాదన ఉందని, ఇందుకు అవసరమైన 10 ఎకరాల భూమిని విశాఖ విమానాశ్రయం సమీపాన ఇచ్చేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని వెల్లడించాయి.
* ఇది ఏర్పాటైతే తొలి విడతలో విశాఖకు నాలుగు డార్నియర్ యద్ధ విమానాలు వస్తాయని, విశాఖ నుంచి భువనే శ్వర్ వరకు వాటిని ఉపయోగిస్తామని అనిల్‌కుమార్ హరబోలా తెలిపారు.
* 1977లో మొదటిసారిగా ఇండియన్ కోస్ట్‌గార్డ్ డేను నిర్వహించామని, ప్రస్తుతం 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నామని తెలిపారు.
* ఇన్నేళ్ల ప్రస్థానంలో ఏడు నౌకల నుంచి 126 నౌకలకు, 62 ఎయిర్క్రా్ఫ్టలతో అభివృద్ధి చెందుతునయీ . ‘ఆంధ్రలో కోస్ట్‌గార్డ్‌కు 13 నౌకలు, ఒక ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నాయి.
* గస్తీదళం బలోపేతానికి అంతర్జాతీయంగా అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు .
views: 818