Current Affairs Telugu Daily

ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2019 స్పెషల్‌ ఎడిషన్‌ పట్టుచీర

* ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్స్‌కు చేరే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. రెండవ రోజు తిరిగి ప్రారంభమైన సెమీ-ఫైనల్‌ మ్యాచ్‌  కొనసాగుతుండగా  వరల్డ్‌కప్‌కోసం ఒక వీరాభిమాని విలక్షణమైన జరీ పట్టు చీరలను సిద్ధం చేశారు.
*  టీమిండియా కోసం ఉత్తరప్రదేశ్ వారణాసి చేనేత కార్మికులు దీన్ని తయారు చేశారు.
* భారత జట్టు సభ్యులు ధరించే జెర్సీ కలర్‌ ‘నీలి’ రంగులో ఈ చీరను రూపొందించారు.  
* ప్రపంచకప్ ప్రత్యేక పట్టు చీరల తయారీని నేతన్నలు దాదాపు  పూర్తి చేశారు.
*  ప్రపంచ్‌కప్‌ ముగిసి దేశానికి తిరిగి వచ్చే భారత క్రికెట్‌ జట్టు ఆటగాళ్లకు ఈ చీరలను బహుమతిగా ఇవ్వనున్నారు.
* ప్రపంచకప్ లోగో తోపాటు క్రికెట్ బ్యాట్, బంతిని కూడా చీరపై ప్రత్యేకంగా చేతితో ఎంబ్రాయిడరీ తయారు చేశారు.
*  చీర మొత్తం కుంకుమ రంగుబార్డర్‌ను ఇచ్చారు.
*  కొంగు (పల్లూ) మీద ‘ఐసీసీ 2019’ ముద్రించడంతోపాటు, 400కి పైగా లోగోలతో ఈ స్పెషల్‌ ఎడిషన్‌ చీరను తీర్చిదిద్దారు.
*  భారత జట్టు ఆటగాళ్లు భార్యలు, లేదా తల్లులకు బహూకరించేలా మొత్తం 16 చీరలను రూపొందించారు. 500 గ్రాముల బరువు ఉన్న పట్టు చీర ధర రూ. 20 వేలు.


views: 677Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams