Current Affairs Telugu Daily

370వ అధికరణంపై సత్వరమే విచారణ
* జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ అధికరణం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించడానికి  సుప్రీంకోర్టు అంగీకరించింది.
*  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ దీపక్‌ గుప్త, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం దీన్ని విచారించనుంది.
*  భాజపా నాయకుడు అశ్విన్‌ ఉపాధ్యాయ దీన్ని దాఖలు చేశారు.
*  భారత రాజ్యాంగంలోని XXI వ భాగం పేర్కొన్న ప్రకరణ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటం జరిగింది. 
* మొదటి షెడ్యూల్ లో జమ్మూ కాశ్మీర్ 15వ రాష్ట్రంగా చేర్చారు. 
* జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము మౌలిక రాజ్యాంగంలో పార్ట్ - బి కేటగిరి రాష్ట్రంగా ఉండేది. 
* రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 7వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ - బి రాష్ట్రాల విధానం రద్దు చేయటం ద్వారా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో సమానంగా గుర్తించబడింది. 
* జమ్మూ కాశ్మీర్ చారిత్రక నేపథ్యం ప్రత్యేక పరిస్థితులలో ప్రకరణ 370 లో రాజ్యాంగ పరంగా ప్రత్యేక హోదాను కల్పించారు.

views: 659



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams