Current Affairs Telugu Daily

భారతదేశంలో ఖరీదైన ప్రాంతంగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ 

* దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్యాలయ ప్రాంతాల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
* అక్కడ కేవలం ఒక చదరపు అడుగుకు 144 అమెరికన్‌ డాలర్ల వార్షిక అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ వెల్లడించింది.  
* దిల్లీ నడిమధ్యలో ఉన్న కన్నాట్ ప్లేస్‌ గత ఏడాది కూడా తొమ్మిదో స్థానాన్నే దక్కించుకుంది. 
* ఈ జాబితాలో హాంకాంగ్‌లోని సెంట్రల్‌ డిస్ట్రిక్‌ వరసగా రెండో ఏడాది మొదటి స్థానాన్నే ఆక్రమించింది.
*  అక్కడ ఒక చదరపు అడుగుకు వార్షిక అద్దె 322 అమెరికన్‌ డాలర్లని సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది.
*  ఈ జాబితాలో లండన్ రెండో స్థానంలో నిలవగా, బీజింగ్ ఐదో స్థానాన్ని ఆక్రమించింది.
* ‘ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలన్నీ తమ ఫ్రంట్ ఆఫీసును ఈ నగరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి’ అని సీబీఆర్‌ఈ వెల్లడించింది.
*  దిల్లీ ప్రధాన మార్కెట్ కావడంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మొదటి పది స్థానాల్లో నిలుస్తూనే ఉందని  సీబీఆర్‌ఈ వెల్లడించింది.
*  అలాగే ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పాయింట్ జాబితాలో 27, 40వ స్థానాల్లో ఉన్నాయి. 2018లో ఇవి వరసగా 26, 37వ స్థానాల్లో నిలిచాయి. 


views: 670

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams