Current Affairs Telugu Daily

1600 కోట్ల ఎంపీల్యాడ్స్ వినియోగం కాలేదు
 16వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యులకు కేటాయించిన ఎంపీల్యాడ్స్‌ నిధుల్లో రూ.1600కోట్లు వినియోగం కాలేదని  కేంద్ర సహాయమంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ వెల్లడించారు.
* 16వ లోక్‌సభలోని పార్లమెంటు సభ్యులకు ఎంపీల్యాడ్స్‌ నిధుల కింద మొత్తం రూ.11,525 కోట్లు కేటాయించగా జులై 4వ తేదీ వరకు రూ.1641.98 కోట్లు వినియోగం కాలేదని తెలిపారు. 
* ఇకనుంచి కేంద్రం ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాలతో వార్షిక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుందని, ఆ సమయానికల్లా ఎంపీల్యాడ్స్‌ నిధులతో పూర్తి చేసిన పనులు, ఉపయోగించిన నిధుల వివరాల నివేదికలను సంబంధిత అధికారులు తమకు సమర్పించాలని  తెలిపారు.
* ఈ నిధులతో చేపట్టిన పనుల్లో పురోగతి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తామన్నారు.
*  అప్పటి  భారత ప్రధాన మంత్రి పి. వి. నరసింహారావు 1993 డిసెంబర్‌ 23న భారత పార్లమెంటులో ఎంపీల స్థానిక అభివృద్ధి నిధుల పథకాన్ని (ఎంపీ ల్యాడ్స్‌) ప్రవేశపెట్టారు. 
*  ప్రస్తుతం పథకంలో భాగంగా ప్రతి సభ్యుడికి సంవత్సరానికి రూ.5 కోట్లు కేటాయిస్తారు.
* మొదటగా ఈ పథకం గ్రామీణాభివృద్ధి  అధీనంలోనిది. 
* ఎంపీ లాడ్స్‌ పథకం విధి విధానాలు అమలుకు అనుసరించాల్సిన వైఖరిని గురించి తొలివిడత మార్గదర్శకాలను 1994, ఫిబ్రవరిలో విడుదల చేశారు. 
* 1994 డిసెంబర్‌, 1997 ఫిబ్రవరి, 1999 సెప్టెంబర్‌, 2002 ఏప్రియల్‌, 2005. నవంబర్‌, 2012 ఆగస్టు, చివరిగా 2014, మే నెలలో సవరిస్తూ వచ్చి, సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించారు. 
* 22 ఏళ్ల కాలంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వివిధ లబ్దిదారులు, పార్లమెంటు సభ్యులు లోక్‌ సభ, రాజ్యసభ కమిటీలు, నాబార్డు కన్సల్టెన్సీ సేవలు (నాబ్‌ కాన్స్‌), భారత కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదికలలో చేసిన సూచనలు, సలహాలను అనుసరించి సమగ్రమైన మార్గదర్శకాలు రూపొందాయి.
* పార్లమెంటు సభ్యులు తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఈ పథకం వీలు కల్పిస్తుంది. స్థానిక అవసరాలు తీరుస్తు, సామాజిక ఆస్తులు పెంచుతూ ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.
* ఈ పథకం ప్రారంభం నుడి తాగు నీటి సదుపాయం, ప్రాథమిక విద్య, ప్రజా ఆరోగ్యం, పారిశుధ్యం, రోడ్లు మొదలైన జాతీయ ప్రధాన్యాలు గల మౌలిక వసతులు కల్పిస్తున్నది.
* ఈ పథకం ప్రారంభమైన తొలి సంవత్సరం 1993-94లో ఎంపీ ల్యాడ్స్‌ కింద ఒక్కో పార్లమెంటు సభ్యుడికి ఐదు లక్షల రూపాయలు మాత్రమే కేటాయించారు. 
* 1994-95లో ఒక్కో ఎంపీ నియోజక వర్గం అభివృద్ధి  కేటాయించే నిధులు కోటి రూపాయలకు పెంచారు. 
* 1998-99లో ఈ నిధులను రెండు కోట్లకి పెంచారు. 
* 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిధిని ఐదు కోట్లకి పెంచారు. ప్రస్తుతం ఐదుకోట్లుగా ఉన్నది.
* జిల్లాల్లో ఎంపీ ల్యాడ్స్‌ పథకం కింద చేపట్టిన కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయానికి ప్రతి రాష్ట్రం, లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఓ నోడల్‌ విభాగాన్ని ఏర్పాటు చేశాయి. 

views: 618

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams