Event-Date: | 11-Jul-2019 |
Level: | National |
Topic: | Science and Technology |
* గతంలో పంపిన చంద్రయాన్-1 ప్రధానంగా చంద్రుడి చుట్టూ ఓ కక్ష్యలో తిరుగుతూ.. చంద్రుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, భూమికి పంపింది.
* కాకపోతే చంద్రుడిపై భారత ముద్ర ఉండాలన్న ఉద్దేశంతో ఓ 35 కేజీల పరిశోధక ‘మూన్ ఇంపాక్ట్ ప్రోబ్’ను (ఎంఐపీ) చంద్రుడి మీదికి జారవిడిచింది.
* చంద్రుడి ఉపరితలం మీద నీరు, ఐస్ ఉందని గుర్తించడం చంద్రయాన్-1 సాధించిన సంచలన విజయం.
* చంద్రుడి మీద నీరు మనం రోజువారీ చూసే నీటి రూపం (హెచ్2ఓ)లో కాకుండా హైడ్రాక్సైల్ అయాన్ల (ఓహెచ్) రూపంలో ఉందని ఇది గుర్తించింది.
* చంద్రయాన్-1లో అమెరికా, ఐరోపా, బల్గేరియాలు కూడా తమతమ సొంత పరిశోధనల కోసం ఆరు పరికరాలను పంపాయి.
* నీటి ఆనవాళ్లను ముందుగా అమెరికా సాధనం ‘మూన్ మినరాలజీ మ్యాపర్’ పట్టుకుంది, అందుకే నీటి ఉనికి గురించి ముందు ‘నాసా’ ప్రకటించింది. ఆ తర్వాత ఇస్రో కూడా దాన్ని నిర్ధారించింది.
* భూకంపాల తరహాలోనే చంద్రకంపాలు కూడా వస్తున్నాయని, చంద్రుడి ఎగువ ఫలకాల్లో కదలికలు సంభవిస్తున్నాయని (టెక్టానిక్ యాక్టివిటీ) గుర్తించింది.
* అలాగే చంద్రుడిలో శాశ్వతంగా చీకటిలోనే ఉండిపోయే అనేక బిలాలను తొలిసారిగా ఫోటోలు తీసి పంపింది. చంద్రుడి ఉపరితల ‘హై రిజల్యూషన్ మ్యాప్’ను సిద్ధం చేసింది.