Current Affairs Telugu Daily

బాబిలోన్ కు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా
* ఇరాక్ లోని ప్రాచీన మెసపటోనియా నగరమైన బాబిలోన్ కు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. 
* క్రీ. పూ. 2000 సంవత్సరాల నాటి బాబిలోన్ నాగరికతకు ఈ నగరం రాజధానిగా వెలసింది. 
* దాదాపు పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రపంచ నాగరికానికి వారసత్వ హోదా కోసం ఇరాక్ ప్రభుత్వం 30 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది. 
* యునెస్కో హెడ్ క్వార్టర్స్ పారిస్ నగరం లో కలదు.
* యునెస్కో 1946 లో ఏర్పడింది.
* ఐక్యరాజ్య సమితి 1946 లో ప్రత్యేక సంస్థగా గుర్తించబడింది.
* యునెస్కో విద్య, సైన్స్ , సమాచార ప్రసారాలు, సాంస్కృతిక రంగాల్లో సహకరించుట ద్వారా శాంతి భద్రతలు పరిరక్షణకు తోడ్పాటునందిస్తుంది.

views: 676



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams