Current Affairs Telugu Daily

గ్రీస్‌ కొత్త ప్రధాని గా కిరియాకోస్‌ మిత్సోటకిస్‌
* గ్రీస్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని అలెక్సిస్‌ సిప్రాస్‌ ఓటమి పాలయ్యారు.
* కిరియాకోస్‌ మిత్సోటకిస్‌ నేతృత్వంలోని న్యూడెమోక్రసీ పార్టీ, సిప్రాస్‌ నేతృత్వంలోని సిరిజా పార్టీపై గెలుపు సాధించింది.
* 75 శాతానికి పైగా ఓటింగ్‌ జరిగిన ఈ ఎన్నికల్లో న్యూడెమోక్రసీ పార్టీ 39.6 ఓట్లు సాధించి అధికారం కైవసం చేసుకొంది.
* ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దశాబ్ద కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చింది.
* ఓటమిని అంగీకరించిన సిప్రాస్‌ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంకించడానికి చేయాల్సిందంతా చేశానని, అయితే గ్రీకు ప్రజల తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు.
* గ్రీక్‌ ప్రజలకు కిరియాకోస్‌ మిత్సోటకిస్‌  ప్రధానిగా అధ్యక్ష నివాసంలో ఆయన పదవీ స్వీకార ప్రమాణం చేశారు.  దేశాన్ని మరింత ప్రైవేటీకరణ దిశగా, బిజినెస్‌ ఫ్రెండ్లీగా మారుస్తానని హామీ ఇచ్చారు.
*  బ్యాంకింగ్‌ సెక్టార్‌లో పనిచేసిన ఈ పూర్వ హార్వర్డ్‌ విద్యార్థి 2013-15 మధ్య మంత్రిగా కూడా పనిచేశారు.

views: 676



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams