Current Affairs Telugu Daily

అమెరికా కాంగ్రెస్‌లో గ్రీన్‌కార్డు బిల్లు

*  అమెరికాలో శాశ్వత నివాసం, ఉపాధి కోసం ఉద్దేశించిన గ్రీన్‌ కార్డు బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లో ఓటింగ్‌కు సర్వం సిద్ధమైంది.
* ఈ బిల్లు కాంగ్రెస్‌ ఆమోదం పొందితే దశాబ్దాల తరబడి గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు భారీగా ప్రయోజనాలు దక్కుతాయి.
*  గ్రీన్‌ కార్డు విషయంలో అమెరికా ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతానికి మించి ఇవ్వకూడదన్న కోటా నిబంధనలు భారత్‌ వలసదారులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.
* జనాభా ఎక్కవ ఉన్న దేశాలకు, తక్కువ ఉన్న దేశాలకు ఒకే నిబంధనలు అమలవుతూ ఉండడంతో భారత్, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వలసదారుల దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి.
* ఈ ఇక్కట్లకు తెరదించడానికి గత ఫిబ్రవరిలో ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్‌ యాక్ట్‌ (హెచ్‌ఆర్‌1044) బిల్లును భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమలా హ్యారిస్‌ తన సహచరుడు మైక్‌లీతో కలిసి సెనేట్‌లో ప్రవేశపెట్టారు.
* ఇదే తరహా బిల్లును కాంగ్రెస్‌ ప్రతినిధుల సభలో జో లాఫ్రెన్, కెన్‌బర్గ్‌లు ప్రవేశపెట్టారు.
*  ప్రతినిధుల సభలో మొత్తం 435 సభ్యులకు గాను రిపబ్లికన్, డెమొక్రాట్‌ పార్టీకి చెందిన 310 మందికి పైగా ప్రజాప్రతినిధుల మద్దతు ఈ బిల్లుకు ఉంది.
* 203 మంది డెమొక్రాట్లు, 108 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు కో స్పాన్సరర్లుగా ఉన్నారు.
* 290 ఓట్లు బిల్లుకు అనుకూలంగా వస్తే దీనిపై ఎలాంటి చర్చలూ, సవరణలూ లేకుండా ఆమోదం 


views: 632Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams